ఏపీలో కొనసాగుతున్న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్.. సొంతూళ్లకు పయనమైన జనం.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఐదు మండలాల్లో పోలింగ్ వాయిదా పడింది.
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 28జిల్లాల పరిధిలో MPTC, ZPTC ఎన్నికలు జరుగుతుండగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. పోటీలో 18,843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు.. 2,169 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
అయితే.. మురుసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో.. అలాగే.. తూర్పుగోదావరి గోపాలపురం మండలంలో పోలింగ్ వాయిదా వేశారు. దీంతో జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి.
కాగా.. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూరుకు ఏపీ వాసులు భారీగా పయనమయ్యారు. దీంతో ప్రయాణికులతో RTC బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!
48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ..
నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి!

