AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ZPTC, MPTC Elections LIVE Updates: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేయనున్న 2.61 కోట్ల మంది ఓటర్లు

AP ZPTC, MPTC Polls 2026 Live Updates in Telugu: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 582 జడ్పీటీసీ, 7వేల 767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోటీలో 18,952 మంది MPTC, 2,169 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. ఏపీవ్యాప్తంగా పరిషత్‌ ఓటర్లు 2.61 కోట్లు ఉండగా.. 31,460 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. 6 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 6,507 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేస్తున్నారు. 40 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

AP ZPTC, MPTC Elections LIVE Updates: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేయనున్న 2.61 కోట్ల మంది ఓటర్లు
Andhra Pradesh Mptc And Zptc Elections
Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 7:11 AM

Share

LIVE NEWS & UPDATES

  • 05 Nov 2026 07:11 AM (IST)

    ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు..

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి అభ్యర్థులు పిలుస్తున్నారు. ఓటు వేసేందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు తామే చెల్లిస్తామంటూ అభ్యర్థులు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికకు ప్రతీ ఓటూ కీలకమేనని అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకు ప్రతీ ఓటరును ఓటు వేసేందుకు అభ్యర్థిస్తున్నారు ఎన్నికల్లో పోటీకి నిలబడిన వ్యక్తులు. దీంతో జనం ఊరిబాట పట్టారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్ల దగ్గర జనం ఇబ్బంది పడ్డారు.

  • 05 Nov 2026 07:05 AM (IST)

    హైదరాబాద్ నుంచి సొంతూరుకు పయనం..

    ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు ఏపీ వాసుల పయనమయ్యారు. ఇవాళ్టి పోలింగ్‌లో ఓటేసేందుకు సొంతూరుకు జనం వెళ్తున్నారు. ఎన్నికలతో పాటు దీపావళి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో  RTC బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి వరకు MGBS, ఎల్బీనగర్ బస్టాండ్‌లలో నిరీక్షించారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.

  • 05 Nov 2026 06:57 AM (IST)

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9వేల 829 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 2వేల,51 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 77 ఏకగ్రీవమయ్యాయి. ఇక 7,767 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఈనెల 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 ZPTC, 7వేల 767 MPTC స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోటీలో 18,952 మంది MPTC అభ్యర్థులు, 2,169 మంది జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. ఏపీవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 77  జడ్పీటీసీ, 2వేల 51 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 39 స్థానాలకు గానూ 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 8, మార్కాపురం జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మూడేసి స్థానాలు, ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 39 స్థానాలకు గానూ 23 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 8, మార్కాపురం జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మూడేసి స్థానాలు, ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల విధుల్లో దాదాపు 2లక్షల 52 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల బయటే కాకుండా.. ఓటు రహస్యానికి భంగం కలగకుండా అవసరమైన చోట్ల లోపల కూడా వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో అలర్లు చోటుచేసుకున్న తరుణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అంవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాాట్లు చేశారు.

Published On - Nov 05,2026 6:53 AM

Follow Us