Pushpa: కలెక్షన్లలో తగ్గేదేలే అంటోన్న పుష్ప.. 50 రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పుష్ప' (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది

Pushpa: కలెక్షన్లలో తగ్గేదేలే అంటోన్న పుష్ప.. 50 రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Feb 04, 2022 | 2:49 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ పాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్‌ ఇండియా చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. బన్నీ నటన, సుకుమార్‌ టేకింగ్‌, సామ్‌ స్పెషల్‌ సాంగ్‌, డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో విడుదలైన నెలకే ఓటీటీలో వచ్చినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. ఈ ఏడాది కూడా తన జోరు కొనసాగిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్లు వసూలు చేసిందని శుక్రవారం స్పెషల్‌ పోస్టర్‌ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు.

బాలీవుడ్‌ లోనూ  బ్రహ్మరథం..

కాగా బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో 50 రోజుల పూర్తి చేసుకున్న సినిమా పుష్ప మాత్రమే కావడం విశేషం. ఇక బాలీవుడ్‌ లోనూ ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని పాటలు, డైలాగులకు అంతర్జాతీయంగా కూడా పేరొచ్చింది. ఇక మొదటి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో త్వరలోనే రెండో పార్ట్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘పుష్ప: ది రూల్‌’ ఈ సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటివారంలో షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..