AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter War: ట్విట్టర్‌ వేదికగా యుద్ధానికి దిగిన టాలీవుడ్ ప్రముఖులు.. అసలీ రచ్చకు కారణమేంటంటే..

Twitter War: సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వాగ్వాదాల స్టైల్‌ కూడా మారిపోయింది. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగానే యుద్ధానికి దిగుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం రాజకీయనాయకులకు...

Twitter War: ట్విట్టర్‌ వేదికగా యుద్ధానికి దిగిన టాలీవుడ్ ప్రముఖులు.. అసలీ రచ్చకు కారణమేంటంటే..
Narender Vaitla
|

Updated on: Feb 04, 2022 | 2:52 PM

Share

Twitter War: సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వాగ్వాదాల స్టైల్‌ కూడా మారిపోయింది. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగానే యుద్ధానికి దిగుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం రాజకీయనాయకులకు మాత్రమే పరిమితంగా ఉండేది. అయితే తాజాగా సినీ ప్రముఖులు కూడా ఈ సోషల్‌ మీడియా వార్‌కు దిగుతున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాలీవుడ్‌ ప్రముఖుల మధ్య జరిగిన ట్విట్టర్‌ వార్‌ చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు హరీష్‌ శంకర్‌, రచయిత బీవీఎస్‌ రవిల మధ్య ట్విట్టర్‌ వేదికగా చిన్న సైజ్‌ యుద్ధమే జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. రచయిచ బీవీఎస్‌ రవి గురువారం రాత్రి.. ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌కు దర్శకుడు హరీష్‌ శంకర్‌ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని ట్వీట్ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్‌ను ఎంజాయ్‌ చేయండి. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంఊ రిప్లై ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోయారు.

దీంతో ఈ వార్‌ కాస్త చినికి చినికి గాలి వానగా మారింది. ఇదిలా ఉంటే మొదట రవి చేసిన ట్వీట్‌ను గమనిస్తే ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పీఆర్‌సీ విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్‌లాగే ఉంది. గురువారం రాత్రి నుంచి ఇద్దరి మధ్య జరుగుతోన్న ట్విట్టర్‌ వార్‌కు సంబంధించిన కొన్ని ట్వీట్స్‌…

Also Read: Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ క్షేమం కోరుతూ పాతబస్తీలో ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో

Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు అలర్ట్!రూ.1,75,000ల జీతంతో  హైదరాబాద్‌లో 33 ఉద్యోగాలు.. 6 రోజులే..