AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: సమ్మర్‌లో మేజర్‌ రాకకు ముహూర్తం ఫిక్స్‌.. అడవి శేష్‌ సినిమా విడుదల ఎప్పుడంటే..

క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో అడవి శేష్‌ (Adivi Sesh). త్వరలోనే మేజర్(Major) సినిమాతో మన ముందుకు రానున్నాడు.

Adivi Sesh: సమ్మర్‌లో మేజర్‌ రాకకు ముహూర్తం ఫిక్స్‌.. అడవి శేష్‌ సినిమా విడుదల ఎప్పుడంటే..
Adavi Sesh
Basha Shek
|

Updated on: Feb 04, 2022 | 3:12 PM

Share

క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో అడవి శేష్‌ (Adivi Sesh). త్వరలోనే మేజర్(Major) సినిమాతో మన ముందుకు రానున్నాడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్(Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శేష్‌ మేజర్‌ సందీప్‌ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానుండగా, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కీలకపాత్రలో నటించనుంది. గూఢచారితో శేష్‌కు సూపర్‌ హిట్‌ అందించిన శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఏప్లస్ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా మేజర్‌ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

అయితే వైరస్‌ తగ్గుముఖం పడుతుండడంతో ‘మేజర్‌’ చిత్రాన్ని వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలకు ముంబయి తాజ్‌ హోటల్‌ లో చిత్రీకరించాలని చిత్రబృందం భావించింది. అయితే భద్రతా కారణాలతో అనుమతులు లభించకపోవడంతో ఏకంగా తాజ్‌ హోటల్‌ సెట్‌నే తీర్చిదిద్ది షూటింగ్‌ పూర్తి చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్లు, టీజర్‌ మేజర్‌ సినిమాపై అంచానాలను పెంచేశాయి.

Also Read:Life insurance: జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

Pushpa: కలెక్షన్లలో తగ్గేదేలే అంటోన్న పుష్ప.. 50 రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..