Gangubai: లేడీ డాన్‌గా అదరగొట్టిన అలియాభట్.. గంగూబాయి ట్రైలర్ వచ్చేసింది..
Gangubai Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడీ. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన..
Gangubai Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడీ. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముంబయికి చెంది మాఫీయా క్వీన్ గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమాను విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే సినిమా తేదీ దగ్గరపడడంతో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2.37 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అలియా తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఒకవైపు డాన్‌గా సీరియస్‌లుక్‌లో కనిపిస్తూనే మరోవైపు ఫన్నీ డైలాగ్‌లతో నవ్వించింది. ఇక ట్రైలర్‌లో వచ్చే ‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’, ‘మీకు నా మాటలు అభ్యంతకరంగా అనిపించవచ్చు. కానీ మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకంటే.. మీరు ఒక్కసారి మర్యాద పోగొట్టుకుంటే మొత్తం పోయినట్లే. కానీ మేము ప్రతి రోజూ రాత్రి మా గౌరవాన్ని అమ్ముకుంటాం. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు’ అని చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి అలియా కెరీర్‌కు ఈ సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read: Health Tips: ఈ ఆహారపు అలవాట్లతో కాలేయానికి ప్రమాదం.. అవేంటంటే?
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విజయం సాధించారా.. ఆ విషయం మచ్చగా మిగలనుందా..
Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్లు అలాంటి ఆహారం అస్సలు తినకూడదు.. అవేంటంటే..?