Viral Video: సామీ సామీ సాంగ్ లోని బన్నీ స్టెప్స్ తో అలరించిన హైదరాబాద్ యువతి.. వీడియో వైరల్..

Viral Video: స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే..

Viral Video: సామీ సామీ సాంగ్ లోని బన్నీ స్టెప్స్ తో అలరించిన హైదరాబాద్ యువతి.. వీడియో వైరల్..
Saami Saami Song Viral
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2022 | 5:08 PM

Viral Video: స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ విదేశాల్లో ఉన్న సంగీత అభిమానులను కూడా ఉర్రూతలూగిస్తోంది. పుష్ప సినిమాలోని పాటలను అనుసరిస్తున్న వీడియోలు వైరస్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా మావ సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌, సామీ సామీ సాంగ్ స్టెప్స్ వేస్తూ ఆ వేడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా మృణాలీ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో 9 మిలియన్ల వ్యూస్,  22,00 లైక్‌లు సొంతం చేసుకుంది. మృణాలీ వేసిన పుష్ప మువీలోని సామీ, సమీ సాంగ్ ను అనుకరిస్తూ.. స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ యువతి అల్లు అర్జున్ స్టెప్స్ ను అదేవిధంగా చేసింది. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ వేసుకున్న సేమ్ బట్టలను ధరించింది. బన్నీ కట్టుకున్న అదే కలర్ లుంగీని క‌ట్టుకొని అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ను అనుసరిస్తూ.. తాను కూడా అవే స్టెప్స్ వేసింది. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. యువత డ్యాన్స్ కు యుత్ ఫిదా.. నువ్వు సుపర్బ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:  శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను కేటాయించే అవకాశం..