Life insurance: జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

జీవిత బీమా(Life insurance) ప్రతి ఒక్కరి అవసరమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అయితే పాలసీ తీసుకునే ముందు అన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు...

Life insurance: జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
Insurance Policy
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 04, 2022 | 3:07 PM

జీవిత బీమా(Life insurance) ప్రతి ఒక్కరి అవసరమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అయితే పాలసీ తీసుకునే ముందు అన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. అందరు ఒకే రకమైన బీమా(insurance) తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరి జీవితాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. మొదటగా మీ లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. బీమా పాలసీ అనేది మీరు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, అలాగే మీపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు తోడ్పడే విధంగా ఉండేలా చూసుకోవాలి. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రుణాలు, వైద్య చికిత్సల ఖర్చులు, లేదా రిటైర్మెంట్‌(retirement) నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి పలు రకాల అవసరాలకు ఉపయోగపడేలా పాలసీ ఉండాలి.

తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజీ ఉండాలని భావించేవారికి టర్మ్‌ ప్లాన్‌ సరైన ఎంపిక అవుతుంది. రిటైర్మెంట్‌ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు కావాలంటే యులిప్‌ (యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌) లేదా రిటైర్మెంట్‌ ప్లాన్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మార్కెట్లో ప్రస్తుతం చాలా రకాల పాలసీలు ఉన్నాయి. వాటి నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునే ముందు దానిపై అధ్యయనం చేయడం అవసరం.

ముందుగా పాలసీ రకం, అది అందించే ప్రయోజనాలను తెలుసుకోండి. ఉదాహరణకు కొన్ని ప్లాన్లు రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడతాయి. అలాగే చిల్డ్రన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు మీ పిల్లల భవిష్యత్తు అవసరాలను తీరుస్తాయి. ఇక ఎండోమెంట్‌ పాలసీ అనేది ఇటు జీవిత బీమా అటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. మీకు అధ్యయనం చేయడం కష్టమనిపిస్తే ఎవరైనా ఆర్థిక సలహాదారుడిని సంప్రదించాలి.

మంచి ప్లాన్‌ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో .. తగినంత కవరేజీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. సమ్‌ అష్యూర్డ్‌ అనేది హ్యూమన్‌ లైఫ్‌ వేల్యూ (హెచ్‌ఎల్‌వీ) లేదా ఆర్థికంగా పాలసీదారు విలువపై ఆధారపడి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, చేయాల్సిన చెల్లింపులు, వివిధ దశల్లో ఆర్థిక లక్ష్యాలు మొదలైన అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలి. కవరేజీ వార్షిక వేతనానికి కనీసం 15 రెట్లు అయినా ఉండాలి. టర్మ్‌ పూర్తయ్యే వరకూ వార్షిక ప్రీమియంలను చెల్లించడం ఆపకుండా జాగ్రత్త పడండి.

Read Also.. ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చాలా సులువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..?