Budget 2022 : ‘అమృత కాలంలో అడుగు పెడుతోన్న నవ భారతానికి బూస్టర్ ఈ బడ్జెట్’..

2022- 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం కేంద్ర బడ్జెట్‌(Budget 2022)ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌.

Budget 2022 : 'అమృత కాలంలో అడుగు పెడుతోన్న నవ భారతానికి బూస్టర్ ఈ బడ్జెట్'..
Follow us

|

Updated on: Feb 04, 2022 | 5:13 PM

2022- 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం కేంద్ర బడ్జెట్‌(Budget 2022)ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. కరోనా మహమ్మారి మూడవ వేవ్ సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు ముందు సమర్పించబడంతో ఈ బడ్జెట్‌కు కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు పెద్ద ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో సంబంధమున్న నేతలు ఈ బడ్జెట్‌ను ఎంతో మెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ వినూషారెడ్డి బడ్జెట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

స్వావలంబన, స్వయం సమృద్ధిపై..

‘ప్రతి ఒక్కరూ బలంగా మరియు స్వయం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే విలువైన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కృషిని చేయడానికి సిద్ధంగా ఉంటారు – మహాత్మా గాంధీ. స్వదేశీ, స్వరాజ్యం.. మహాత్మా గాంధీజీ రెండు ప్రధాన లక్ష్యాలివి. అయితే స్వరాజ్యాన్ని పొంది ఆరు దశాబ్దాలు గడిచినా తర్వాత కూడా ‘స్వదేశీ’ సుదూర నెరవేరని లక్ష్యంగానే మిగిలిపోయింది. గుజరాత్‌ను స్వావలంబనతో పెట్టుబడుల కేంద్రంగా మార్చడంలో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ విజయం సాధించారు. ఆయన ప్రధాని అయిన తర్వాత దేశం స్వావలంబన, స్వయం సమృద్ధిపై దృష్టి పెట్టారు. కానీ కొవిడ్ మహమ్మారితో ప్రపంచం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాలను, జీవనోపాధిని నాశనం చేసింది. అటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. కోట్లాది మంది భారతీయుల జీవితాలను కాపాడే చర్యలు చేపట్టి సంక్షోభాన్ని అవకాశంగా మార్చింది. భారతదేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం తోపాటు నిరుపేదలకు సంక్షేమ చర్యలు అందించాలనే లక్ష్యంతో ప్రస్తుత యూనియెన్ బడ్జెట్‌ జాగ్రత్తగా రూపొందించబడింది. బడ్జెట్ రూ.39.45 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు 6.4%గా నిర్ణయించారు. ప్రధానంగా ఉద్యోగాల కల్పన, పేదల సంక్షేమం లక్ష్యంగా వివిధ రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.

మౌలిక వసతులకు పెద్దపీట..

బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం.మూలధన వ్యయం 35.4% పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు, నికర వ్యయం 10.68 లక్షల కోట్ల కు చేరింది. రైల్వేలకు రూ.1.4 లక్షల కోట్లు, జాతీయ రహదారులకు రూ. 1.99 లక్షల కోట్లు, కమ్యూనికేషన్‌కు 1.05 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1.38 లక్షల కోట్లు కేటాయించారు. 25000 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు రూ.20వేల కోట్లు కేటాయించారు. 2022-23లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 89 లక్షల ఇళ్లను నిర్మించేందుకు రూ.48వేల కోట్ల, జల్ జీవన్ మిషన్ ‘హర్ ఘర్ నల్ సే జల్’ ద్వారా 3.8 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందించడానికి 60వేల కోట్లు, అదేవిధంగా ఆరోగ్యానికి రూ.86606 కోట్లు కేటాయించారు. ఈశాన్యాన్ని అభివృద్ధి చేసేందుకు పీఎం డివైన్ ( PM DEVINE)ప్రారంభించారు. 100 కొత్త కార్గో టెర్మినల్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. ఈ చర్యలన్నీ ప్రజల జీవితాలు వారి జీవనోపాధిని మెరుగుపరుస్తాయి. ఈ చర్యలలో చాలా వరకు పేదలకు మెరుగైన సౌకర్యాలను అందించడమే కాకుండా నిర్ణీత సమయంలో లక్షలాది ఉద్యోగాలను అందిస్తాయి.

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో డిజిటల్‌ రూపాయి..

‘మేక్ ఇన్ ఇండియా’ – భారత్ తయారీ ఉద్యోగాల సృష్టికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. హాస్పిటాలిటీ రంగానికి రూ.5 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ.5.25 లక్షల కోట్లు కేటాయించనున్నారు. 68 శాతం రక్షణ కొనుగోళ్లు భారతదేశంలోని ఉత్పత్తి అయ్యే పరిశ్రమల నుంచే జరగాలి. భారతదేశంలో 400 కొత్త వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నారు. ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి క్రెడిట్ అందించడానికి ఆత్మ నిర్భర్ అభియాన్ భారత్‌లో భాగంగా 2020లో ప్రారంభించబడిన ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) 1.5 కోట్ల ఉద్యోగాలను కాపాడగలిగింది . ECLGS మార్చి 2023 వరకు పొడిగించారు . MSME రంగాన్ని రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం లక్యంగా పెట్టుకుంది. మూలధన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు కేటాయించారు. అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్స్ కోసం రూ.19, 500 కోట్ల సబ్సిడీ. పాలీ సిలికాన్ ఉత్పత్తుల కోసం రూ .19500 కోట్లు పీఎల్ఐ(PLI), 60 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ( PLI) అమలు చేస్తున్నారు. ఈశాన్య భారతీయుల జీవనోపాధి కోసం రూ.1500 కోట్లు కేటాయించారు. జాతీయ హైడ్రో & సోలార్ ప్రాజెక్టులకు రూ.1400 కోట్లు మంజూరు. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్( ECLGS) ద్వారా హాస్పిటాలిటీ రంగానికి రూ.50000 కోట్లు ఇవ్వాలి. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు బ్యాటరీ మార్పిడి విధానానికి ప్రోత్సాహం. నరేంద్ర మోడీ ప్రభుత్వం సుపరిపాలన మరియు సులభంగా వ్యాపారం చేయడం మరియు జీవించడంపై దృష్టి సారించింది. ఈ బడ్జెట్ పాలనను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్‌ను అమలు చేయనున్నారు. ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్ రికార్డుల ద్వారా నిర్వహించడానికి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించబడుతుంది. ఈ -పాస్ పోర్టులు 2022-23 నాటికి జారీ అవుతాయి .200 TV ఛానెల్‌లు క్లాస్ రూమ్ లెర్నింగ్ కోసం ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలను 1.5 లక్షల పోస్టాఫీసులలో కూడా తీసుకురానున్నారు . 75 జిల్లాల్లో త్వరలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. RBI 2022-23 నాటికి బ్లాక్ చైన్‌తో డిజిటల్ రూపాయిని తీసుకురానుంది. వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను విధించనున్నారు.

అన్నదాతలకు అండగా..

మోడీ ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాత ప్రభుత్వమే. ఈ బడ్జెట్‌లో రైతులకు సాధికారత కల్పించే చర్యలు కొనసాగాయి. కనీస మద్దతు ధర (MSP) కోసం 2.3 లక్షల కోట్లు కేటాయించారు.1000 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యం. సేకరణ కోసం ఇ-వే బిల్లింగ్ విధానాన్ని ప్రారంభించనుంది. రసాయన రహిత సహజ వ్యవసాయం, అగ్రో ఫారెస్ట్రీ, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు ఉపయోగించే కిసాన్‌ డ్రోన్‌లపై ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కెన్ బెత్వా నది అనుసంధానం ప్రాజెక్ట్ కోసం రూ.44605 కోట్లను కేటాయించారు. దీని ద్వారా 9 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు, 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి రానుంది. స్టార్టప్‌లు డ్రోన్ శక్తి ప్రాజెక్టులతో అనుసంధానమవుతాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాలిక లక్ష్యంతో నూనెగింజల సాకుకు ప్రోత్సాహం . యూరియా సబ్సిడీకి రూ.63232 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు. తేనెను ఇ-కామర్స్ ద్వారా ప్రచారం. ఆహారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాలిక లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కు ప్రోత్సాహం ఇచ్చారు .ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జాతీయ పెన్షన్ (NPS )ఖాతాలపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. పన్నులను అప్‌డేట్ చేయడానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చారు. అదేవిధంగా స్టార్టప్‌లకు ఒక సంవత్సరం పన్ను మినహాయింపు లభించనుంది . దీర్ఘకాలిక మూలధన లాభం పన్నులపై సర్‌ఛార్జ్‌లు 15 శాతానికి పరిమితం చేయబడ్డాయి.దేశం మూడో దశ కొవిడ్ ను ఎదుర్కొంటోన్న తరుణంలో బడ్జెట్‌ రూపొందించడం చాలా కష్టమైన పని. ఉద్యోగాలు, ఆస్తులు సృష్టించడం, నిరుపేదలకు సంక్షేమం అందించడం వంటి ప్రధాన ఉద్దేశ్యంతో ఈ బడ్జెట్‌ను నిశితంగా రూపొందించారు. ఈ బడ్జెట్ కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడం , భారతదేశాన్ని ‘స్వయం సమృద్ధి భారత్’ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ‘అమృత్ కాలం’ లోకి అడుగు పెడుతున్న భారతదేశానికి అవసరమైన బూస్టర్ ఈ బడ్జెట్.’ – డాక్టర్‌ వినూషా రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ పాలసీ & రీసెర్చ్ & స్టేట్ మీడియా ప్యానలిస్ట్, బీజేపీ ఆంధ్రప్రదేశ్.

Also Read:Allu Arjun: అక్కడా తగ్గేది లే అంటోన్న బన్నీ.. కొత్త యాడ్‌లో సౌత్‌ సినిమాపై ఫన్నీ కామెంట్స్‌.

AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..

IPL 2022 Auction: వేలంలో ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ-గంభీర్..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..