AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా' లో ప్రసారమవుతోన్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (UnstoppableWithNBK)’.

AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..
Basha Shek
|

Updated on: Feb 04, 2022 | 4:25 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ లో ప్రసారమవుతోన్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (UnstoppableWithNBK)’. సిల్వర్‌ స్ర్కీన్‌పై తనదైన నటనతో ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపే బాలయ్య ఈ టాక్‌ షో కోసం మొదటిసారి హోస్ట్‌ గా మారిపోయారు. తన తోటి నటీనటులను సరదా ప్రశ్నలు అడుగుతూ, వారి వ్యక్తిగత జీవితంలోని విషయాలను రాబట్టే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఓటీటీ చరిత్రలోనే రికార్డు వ్యూస్‌ తో సంచలనం సృష్టిస్తోన్న ఈ టాక్‌ షో IMDBలోని టాప్-10 రియాలిటీ టీవీషోల జాబితాలో స్థానం దక్కించుకుంది. కాగా గతేడాది ప్రారంభమైన ఈ షోకు మొదటి అతిథిగా మంచు ఫ్యామిలీ వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు(Mohanbabu) తో పాటు ఆయన కూతురు లక్ష్మి మంచు, విష్ణు ఈ షోలో సందడి చేశారు.

‘ఎక్కువ అడిగితే ఫసక్‌’ ! ఇప్పటికే ఇప్పటికే 9 ఎపిసోడ్‌లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్‌షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. నేడు (ఫిబ్రవరి4) గ్రాండ్‌ ఫినాలే ప్రసారం కానుంది. కాగా మొదటి సీజన్‌ ముగింపునకు రావడంతో ఈ టాక్‌ షోకు సంబంధించి కొన్ని మధురమైన క్షణాలను పంచుకుంటున్నారు ఆహా నిర్వాహకులు. ఇందులో భాగంగానే మోహన్‌ బాబు ఎపిసోడ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి, విష్ణులలో మోహన్‌బాబుకు ఎవరంటే బాగా ఇష్టమో తెలుసుకోవడానికి ఓ చిన్న గేమ్‌ను ఆడించాడు బాలయ్య. ఇందులో భాగంగా లక్ష్మి, విష్ణులను కొద్దిగా దూరం పంపి కేవలం మోహన్‌ బాబును మాత్రమే ఎదురుగా కూర్చొబెట్టారు. ముందుగా ‘ఇద్దరిలో ఎవరికి కోపం బాగా ఎక్కువ’ అని మోహన్‌ బాబును అడుగుతాడు బాలయ్య. దీనికి సమాధానంగా కూతురు లక్ష్మిని చూపిస్తారు కలెక్షన్‌ కింగ్‌. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు బాగా ఎమోషనల్‌ అని ప్రశ్నించగా ఇద్దరూ ఎమోషనలే అంటారు. అయితే రెండు కాదు..ఒకటే ఆన్సర్‌ చెప్పాలని బాలయ్య అడగడంతో మళ్లీ కుమార్తెనే చూపిస్తారు మోహన్ బాబు. అనంతరం ‘మీ డబ్బును ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు’ అని అడగ్గా పక్కనున్న లక్ష్మి, మంచు ఒకరినొకరు చూపించుకుంటారు. దీనికి సమాధానమే అక్కర్లేదు ‘ఈమె దుస్తులే ఆన్సర్‌ చెబుతాయి’ అంటూ తన సోదరిని ఆటపట్టిస్తాడు విష్ణు. చివరకు మోహన్‌ బాబు కూడా మంచు లక్ష్మినే చూపిస్తాడు. ఇలా బాలయ్య అడిగిన అన్ని ప్రశ్నలకు లక్ష్మినే చూపించడంతో ‘నా గురించి ఏమైనా తప్పు చెప్పుండాలి.. ఇంటికొస్తే చూసుకుంటాను మిమ్మల్ని’ తండ్రినే బెదిరిస్తుంది మంచువారమ్మాయి (సరదాగా). ఇక చివరలో మోహన్‌ బాబు సిగ్నేచర్‌ డైలాగ్‌ ‘ఎక్కువ అడిగితే ఫసక్‌’ చెప్పి ఆకట్టుకున్నాడు బాలయ్య. మరి నెటిజన్లతో నవ్వుతెప్పిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:Adivi Sesh: సమ్మర్‌లో మేజర్‌ రాకకు ముహూర్తం ఫిక్స్‌.. అడవి శేష్‌ సినిమా విడుదల ఎప్పుడంటే..

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..

Baby Bump: ఈ మహిళ బేబీ బంప్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..