Goutam Adani : ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ..మరో రికార్డూ కైవసం
ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Goutam adani) సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లో అపర కుబేరుడిగా నిలిచిన అదానీ మరో కొత్త మైలు రాయిని చేరుకున్నారు.
ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Goutam adani) సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లో అపర కుబేరుడిగా నిలిచిన అదానీ మరో కొత్త మైలు రాయిని చేరుకున్నారు. 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్(Forbes) పత్రిక వివరాలు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో పదో స్థానానికి చేరారని తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్ ను అదానీ అధిగమించారు. అదానీ గ్రూప్ కు పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో అదానీ గ్రూప్ కు ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కారణాలతో ఏప్రిల్ 2021లో $50.5 బిలియన్లు ఉన్న సంపద ప్రస్తుతం రెట్టింపు అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నికర విలువ ఒక రోజులో $2.2 బిలియన్లు పడిపోయిందని, దీంతో ఆయన సంపద $89 బిలియన్లకు తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. ప్రపంచ అగ్ర కుబేరుడు ఎలన్ మస్క్ సంపద రోజులో $3.3 బిలియన్లు తగ్గిందని వివరించింది
మెటా షేర్లు గురువారం రికార్డు స్థాయిలో కుప్పకూలిన కారణంగా ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్ సంపద 29 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫలితంగా ఆయన అస్తుల విలువ భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్అదానీ కంటే తక్కువగా నమోదైంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉంది. జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 89 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 232 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్ 193.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్ బెజోస్ 164.8 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్131.9 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
also read
Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..
India-China: గత నాలుగేళ్లగా చైనా నుంచి తగ్గుతున్న దిగుమతులు… ఆ దేశానికి పెరుగుతున్న ఎగుమతులు..
Coronavirus: బిగ్ బీ ఇంట్లో మళ్లీ కరోనా కలకలం.. జయా బచ్చన్‌కు కొవిడ్ పాజిటివ్..