AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: బిగ్‌ బీ ఇంట్లో మళ్లీ కరోనా కలకలం.. జయా బచ్చన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌..

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ (Amitabh Bachchan), సతీమణి, ప్రముఖ నటి, సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ (Jaya Bachchan) కొవిడ్‌ (Covid19) బారిన పడ్డారు.

Coronavirus: బిగ్‌ బీ ఇంట్లో మళ్లీ కరోనా కలకలం.. జయా బచ్చన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌..
Jaya Bachchan
Basha Shek
|

Updated on: Feb 04, 2022 | 5:58 PM

Share

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ (Amitabh Bachchan), సతీమణి, ప్రముఖ నటి, సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ (Jaya Bachchan) కొవిడ్‌ (Covid19) బారిన పడ్డారు. గతేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య అందరూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ జయా బచ్చన్‌ ఈ మహమ్మారికి చిక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె వైరస్‌ నుంచి తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో బిగ్‌బీ సతీమణికి కరోనా పాటిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జయా బచ్చన్‌ ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆమెకు కరోనా సోకడంతో షూటింగ్‌ను అర్ధాంతరంగా ఆపేశారు ఆ చిత్ర దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రీతిజింటా, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి హేమాహేమీ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల షబానా ఆజ్మీ సైతం కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు జయా బచ్చన్ కూ రావడంతో న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ప్లాన్ చేసిన షెడ్యూల్ నిలిచిపోయింది.

గతంలోనూ..

కాగా గతేడాది అమితాబ్ కొవిడ్‌ 19 బారిన పడ్డారు. జూలైలో కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాదాపు 23 రోజులు చికిత్స తీసుకున్నారు. ఒక వారం తర్వాత అభిషేక్‌, ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యలకు సైతం కరోనా సోకింది. అయితే జయా బచ్చన్‌ కు మాత్రం నెగెటివ్‌ అని తేలింది. ఇక గత నెల ప్రారంభంలో కూడా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేపింది. ముంబయిలోని బిగ్‌బీ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది.

Also Read:UP ASSEMBLY ELECTIONS – 2022: యోగి ఆదిత్యనాథ్ గెలుపునకు ట్రాన్స్ జెండర్ల మద్దతు.. తిరిగి అధికారం చేపడతారని విశ్వాసం..

Budget 2022 : ‘అమృత కాలంలో అడుగు పెడుతోన్న నవ భారతానికి బూస్టర్ ఈ బడ్జెట్’..

AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..