Allu Arjun: అక్కడా తగ్గేది లే అంటోన్న బన్నీ.. కొత్త యాడ్‌లో సౌత్‌ సినిమాపై ఫన్నీ కామెంట్స్‌.

Allu Arjun Zomato: పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ ఒక్క సినిమా బన్నీ రేంజ్‌ ఏంటో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది. పుష్పలో బన్నీ మ్యానరిజానికి యావత్‌ దేశం ఫిదా అయ్యింది...

Allu Arjun: అక్కడా తగ్గేది లే అంటోన్న బన్నీ.. కొత్త యాడ్‌లో సౌత్‌ సినిమాపై ఫన్నీ కామెంట్స్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2022 | 4:33 PM

Allu Arjun Zomato: పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ ఒక్క సినిమా బన్నీ రేంజ్‌ ఏంటో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది. పుష్పలో బన్నీ మ్యానరిజానికి యావత్‌ దేశం ఫిదా అయ్యింది. రీల్స్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసిన బన్నీ పుష్ప స్టెప్పులు హల్చల్‌ చేస్తున్నాయి. ఇక ఇలా పెరిగిన బన్నీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. బన్నీతో యాడ్స్‌ చేయడానికి కొత్తగా కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటికే పలు బ్రాండ్స్‌తో దూసుకుపోతున్న అల్లు అర్జున్‌ తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు.

తాజాగా తెరకెక్కిన జొమాటో యాడ్ నెట్టింట సందడి చేస్తోంది. ఈ యాడ్‌లో బన్నీతో పాటు మరో నటుడు సుబ్బరాజ్‌ కూడా నటించాడు. అయితే మేకర్స్‌ ఈ యాడ్‌కు క్రియేటివిటీతో పాటు కాస్త హ్యూమర్‌ను కూడా జోడించారు. యాడ్‌లో అల్లు అర్జున్‌, సుబ్బరాజ్‌ను కొట్టగానే.. గాల్లోకి లేస్తాడు. దీంతో సుబ్బరాజ్‌ మాట్లాడుతూ.. ‘బన్నీ కొంచెం తొందరగా కింద పడేయవా.?’ అని అంటే దానికి బన్నీ స్పందిస్తూ.. ‘సౌత్ సినిమా కదా! ఎక్కువ సేపు ఎగరాలి’ పంచ్‌ వేస్తారు.

దీంతో సుబ్బరాజు .. ‘గోంగూర మటన్ తినాలని ఉంది. కిందికి వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు’అనగానే.. బన్నీ మాట్లాడుతూ.. ‘గోంగూర మటన్ ఏంటి? ఎప్పుడు ఏం కావాలన్నా జొమోటో ఉందిగా’ అని చెబుతారు. ఇలా ఫన్నీగా సాగే యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాడ్‌ చీవర్లో ‘మనసు కోరితే… తగ్గేదే లే’ అని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యాడ్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించడం విశేషం. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప పార్ట్‌ 2ని మొదలు పెట్టే పనిలో ఉన్నారు.

Also Read: Medaram Jatara: కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Largest Power Bank: ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ బ్యాంక్‌.. ఒకేసారి 5 వేల ఫోన్లకు చార్జింగ్‌

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..