Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..

క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న లైగర్ సినిమా చివరి షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చార్మి సోషల్ మీడియాలో కీలక అప్‌డేట్ అందించారు. పాన్ ఇండియాగా రానున్న ఈ సినిమాను మొత్తం ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు.

Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..
Liger Movie
Venkata Chari

|

Feb 04, 2022 | 2:23 PM

Liger: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్(Puri Jagannadh) డైరెక్షన్‌లో క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న లైగర్ సినిమా చివరి షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చార్మి(Charmy Kaur) సోషల్ మీడియాలో కీలక అప్‌డేట్ అందించారు. పాన్ ఇండియాగా రానున్న ఈ సినిమాను మొత్తం ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా షూటింగ్‌‌లు ఊపందుకోవడంతో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈమేరకు ఏర్పాటు చేసిన సెట్‌ ఫోటోను చార్మి నెట్టింట్లో పంచుకుని విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.

ఈ సినిమాను చాలాభాగం ముంబైలో షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆగష్టు 25న పాన్ ఇండియాగా 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

Also Read: Sreemukhi: సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న బబ్లీ బ్యూటీ.. అందాల యాంకరమ్మ ‘శ్రీముఖి’.. (ఫొటోస్)

Shriya Saran with daughter Photos: తన గారాలపట్టితో మురిపాలాడుతున్న ‘శ్రీయ’.. సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu