- Telugu News Photo Gallery Business photos Audi Q7 facelift versions launched starting at Rs 79.99 lakh
Audi SUV Q7: లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ నుంచి మరో కారు.. అత్యాధునిక ఫీచర్స్
Audi SUV Q7: మార్కెట్లో రోజురోజుకు కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి ..
Updated on: Feb 04, 2022 | 2:22 PM

Audi SUV Q7: మార్కెట్లో రోజురోజుకు కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కార్ల కంపెనీలు. ఇక జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ.. భారత మార్కెట్లోకి తన ఎస్‌యూవీ క్యూ7 సరికొత్త వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది.

ఈ కారు ధర రూ.79.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు 5.9 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. కొత్త క్యూ7 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. క్యూ7 ప్రీమియం ప్లస్, క్యూ7 టెక్నాలజీ ధరలు వరుసగా రూ.79.99 లక్షలు, రూ.88.33 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి.

ఈ కారు అన్నివర్గాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. అత్యాధునిక ఫీచర్లను జోడించిన కొత్త క్యూ7 బుకింగ్‌లను గత నెలలో ఆడీ ప్రారంభించింది.

ఆడీ ఇండియా 2021లో 3,293 కార్లను భారత్‌లో విక్రయించింది. 2020లో విక్రయించిన కార్ల సంఖ్య 1,639గా ఉంది. ఇప్పుడు ఈ కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారులో ఎన్నో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.




