Tamannaah Bhatia: అభిమాని ట్వీట్‌కు అదిరిపోయే రిప్లే ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. క్రేజీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని సక్సెస్ సాధించింది. హీరోయిన్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించింది తమన్నా. ప్రస్తుతం తెలుగులో తమిళ్ లో సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ ఆతర్వాత తక్కువ సమయంలోనే టాక్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. దాదాపు యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని సక్సెస్ సాధించింది. హీరోయిన్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించింది తమన్నా. ప్రస్తుతం తెలుగులో తమిళ్ లో సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.
బాలీవుడ్ లో రకరకాల వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. మొన్నీమధ్య గ్లామర్ కు గేట్లెత్తేసి అందాలతో అదరగొడుతోంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. నటుడు విజయ్ వర్మ ను ఈ అమ్మడు పెళ్లాడనుందని తెలుస్తోంది. తమన్నా 2005లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ చిన్నది తన సినీ కెరీర్ లో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో ఫ్యాన్స్ తమన్నా ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని తమన్నా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తమన్నా నటించిన సినిమాల్లోని ఫోటోలను కలిపి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫొటోకు తమన్నా రిప్లే ఇచ్చింది. ఆ అభిమాని ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేశాడు. దానికి తమన్నా రిప్లే ఇస్తూ.. చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. అలాగే ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో తమన్నా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అభిమానులకు తమన్నా ఇలా రిప్లే ఇవ్వడం పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా హిందీలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది.
తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd
— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




