Saranya Sasi: ఇండస్ట్రీలో మరో విషాదం.. పదేళ్లుగా క్యాన్సర్‏తో పోరాటం.. కరోనా కాటుకు బలి.. నటి శరణ్య కన్నుమూత..

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు అనారోగ్య సమస్యలతో

Saranya Sasi: ఇండస్ట్రీలో మరో విషాదం.. పదేళ్లుగా క్యాన్సర్‏తో పోరాటం.. కరోనా కాటుకు బలి.. నటి శరణ్య కన్నుమూత..
Saranya Sasi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2021 | 3:37 PM

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఎంతో ప్రముఖులు కన్నుముశారు. ఈ ఏడాదిలో ఎంతో మంది పాపులర్ నటీనటులను చిత్రపరిశ్రమ కోల్పోయింది. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) కన్నుమూశారు. కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శరణ్య ఆగస్ట్ 9న తుదిశ్వాస విడిచారు. అయితే పదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కోన్న శరణ్యకు పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం చేశారు.

క్యాన్సర్‏కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కరోనా మహమ్మారి శరణ్యకు సోకింది. ఇటీవల కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలోనే న్యూమోనియాతోపాటు రక్తంలో సోడియం లెవల్స్ తగ్గిపోయాయి. దీంతో చికిత్స కోసం కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుంది. కోవిడ్ నుంచి కోలుకున్నా కానీ.. ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సోమవారం కన్నుమూసింది. శరణ్య.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. మంత్రకోడి, హరిచందనం, సీత వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చోటా, ముంబై, తలప్పవు, బాంబే, చాకో రండమన్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలలో నటించి మెప్పించింది. శరణ్య మృతిపై మాలయళ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Prakash Raj: ప్రకాష్ రాజ్ కాలికి గాయం.. సర్జిరీ కోసం హైదరాబాద్ రాక.. ట్వీట్ వైరల్..

Paagal Trailer: ఏకంగా 1600 మంది అమ్మాయిలను లవ్ చేసిన విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న ‘పాగల్’ ట్రైలర్..

Singer Sunita: నా పెళ్లి గురించి ఎక్కువుగా వారే ఆలోచించారు.. రామ్‌తో వివాహంపై సునీతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మగువలే డామినేట్‌ చేయనున్నారా.? లీక్‌ అయిన జాబితా ఇదే చెబుతోంది.