AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మగువలే డామినేట్‌ చేయనున్నారా.? లీక్‌ అయిన జాబితా ఇదే చెబుతోంది.

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ షోకి ఫ్యాన్స్‌గా మారుతున్నారు. హాలీవుడ్‌లో...

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మగువలే డామినేట్‌ చేయనున్నారా.? లీక్‌ అయిన జాబితా ఇదే చెబుతోంది.
Bigboss 5
Narender Vaitla
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 12, 2021 | 7:25 PM

Share

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ షోకి ఫ్యాన్స్‌గా మారుతున్నారు. హాలీవుడ్‌లో మొదలైన బిగ్‌బాస్‌ సందడి టాలీవుడ్‌ వరకు చేరిందంటేనే ఈ షోపై జనాల్లో ఎలాంటి ఉత్సుకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్‌, సీజన్‌కు ఈ రియాలిటీ షోను చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నిర్వాహకులు కూడా ప్రతీ సీజన్‌ను పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్‌బాస్‌ 5వ సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. అలా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్‌ స్టేట్‌మెంట్‌ రాకపోయినప్పటికీ.. రోజుకో పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేనా వారు తీసుకునే రెమ్యునరేషన్‌పై కూడా గాసిప్‌లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మగువల హవానే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు లీక్‌ అయిన వివరాల ప్రకారం ఏకంగా ఈసారి హౌజ్‌లోకి పది మంది మగువలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బహుశా ఇదివరకు జరిగిన సీజన్‌లలో ఈ సంఖ్యలో లేడీ కంటెస్టెంట్‌లు పాల్గొని ఉండలేరేమో. అంతేకాకుండా తాజాగా వినిపిస్తోన్న పేర్లలో ప్రియాంక సింగ్‌, సురేఖ వాణి, యాంకర్‌ వర్షిణి, ఆర్‌జే కాజల్‌ వంటి అందమైన మగువల పేర్లు వినిపిస్తుండడంతో ఈసారి షోకు బిగ్‌బాస్‌ నిర్వహాకులు కాస్త గ్లామర్‌ డోస్‌ను ఎక్కువగానే అద్దినట్లు కనిపిస్తోంది. మరి సోషల్‌ మీడియాలో పుకార్లు చేస్తోన్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Kitchen Tips: మీ ఇంట్లో కూరగాయలు తాజాగా ఉండాలా.. 15 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇలా చేయండి..

Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..? వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే హ్యాక్ అయ్యే అవకాశం

Chiranjeevi-Meerabai Chanu: నీ మనసు నిజంగానే బంగారం అంటూ మీరాబాయి పై చిరంజీవి ప్రశంసల జల్లు