Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..? వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే హ్యాక్ అయ్యే అవకాశం
Update Google Chrome: మీ పీసీలో లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారా..? అయితే వెంటనే మీ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయండి. లేదంటే..
Update Google Chrome: మీ పీసీలో లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్(google chrome) బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారా..? అయితే వెంటనే మీ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయండి. లేదంటే మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వాడే వెర్షన్‌లో కొన్ని సెక్కూరిటీ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా వెర్షన్ 92.0.4515.131 కి అప్‌డేట్ కావాలని ఇండియన్ కంప్యూటర ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) పేర్కొంది. పాత వెర్షన్‌లో రిమోట్ పద్ధతిలో దాడి జరిగే అవకాశం ఉందని, త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. బుక్‌మార్క్‌లలో బఫర్ ఓవర్ ఫ్లో లోపం కారణంగా గూగుల్ క్రోమ్ హ్యాకింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. విండోస్, లైనక్స్, మాక్ ఓఎస్‌ల కోసం నావిగేషన్ కోసం చేసిన మార్పులతో సెక్కూరిటీ లోపం వెలుగు చూసిందని టీం పేర్కొంది.
హ్యాకింగ్ ఎలా అవనుంది… ప్రత్యేకంగా రూపొందించిన ఓ డాక్యుమెంట్ పంపించడంతో హ్యాకర్లు మన పీసీలోకి ఎంటర్ అవుతారని, దీంతో హ్యాకింగ్ చేసేందుకు ఈజీగా మారనుందని పేర్కొన్నారు. ఇటీవల సీఈఆర్‌టీ-ఇన్ యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు ఐఓఎస్ 14.7.1కు, ఐప్యాడ్ ఓఎస్ 14.7.1కు అప్‌డేట్ కావాలని కోరిన విషయం తెలిసిందే.