Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube Slide To Seek: యూట్యూబ్‌ వీడియోలను ఫార్వార్డ్‌ చేయడంలో ఇబ్బంది ఉందా.. కొత్త ఫీచర్‌తో దీనికి చెక్‌.

Youtube Slide To Seek: ఏదైనా వీడియో చూడాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్‌. వంటల నుంచి వాహనాల రివ్యూ వరకూ అన్ని రకాల వీడియోల కోసం యూట్యూబ్‌లో వెతుకుతుంటారు...

Youtube Slide To Seek: యూట్యూబ్‌ వీడియోలను ఫార్వార్డ్‌ చేయడంలో ఇబ్బంది ఉందా.. కొత్త ఫీచర్‌తో దీనికి చెక్‌.
Youtube
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 10, 2021 | 7:18 AM

Youtube Slide To Seek: ఏదైనా వీడియో చూడాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్‌. వంటల నుంచి వాహనాల రివ్యూ వరకూ అన్ని రకాల వీడియోల కోసం యూట్యూబ్‌లో వెతుకుతుంటారు. ఇక యూట్యూబ్‌ ఉపయోగించే క్రమంలో వీడియోను ఫార్వర్డ్‌, రివైండ్‌ చేయాలంటే స్క్రీన్‌ మీద రెండు సార్లు టాప్‌ చేస్తుంటాం. అయితే ఇలా కేవలం పది సెకన్ల వీడియో మాత్రమే ఫార్వర్డ్‌ లేదా రివైండ్‌ అవుతుంది. అయితే ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్‌ అవ్వడం వల్ల తర్వాతి వీడియో ప్లే అవుతుంది. మనం చూస్తున్న వీడియో మధ్యలోనే ఆగిపోతుంది. దీంతో మళ్లీ వీడియోను మొదటి నుంచి చూడాల్సి వస్తుంది.

దీనికి చెక్‌ పెట్టడానికే యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. స్లైడ్‌ టు స్లీక్‌ పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.ఈ కొత్త ఫీచర్‌తో ఇకపై వీడియోలను చాలా సులభంగా ఫార్వర్డ్‌ లేదా బ్యాక్‌ వర్డ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా వీడియో పై భాగంలో ఓ చిన్న గీత ఉండి.. ‘స్లైడ్‌ టు లెఫ్ట్‌ ఆర్‌ రైట్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిని ఉపయోగించి మీరు వీడియోను ఎక్కడి వరకు ఫార్వర్డ్‌ లేదా బ్యాక్‌వర్డ్‌ చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూట్యూబ్ v16.31.34 వెర్షన్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ యూజర్స్‌కి టెస్టింగ్‌లో భాగంగా అందించారు. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Youtube 1

 

Also Read: Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

Vivo Y53s: భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన వివో.. అద్భుతమైన కెమెరా క్లారిటీ ఈ ఫోన్‌ సొంతం.

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొద్దిగా మార్పు