Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొద్దిగా మార్పు

గత కొద్ది రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి  15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో...

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొద్దిగా మార్పు
Petrol Diesel Price India Today
Follow us

|

Updated on: Aug 10, 2021 | 6:42 AM

Petrol-Diesel Rates Today: గత కొద్ది రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి  15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.10గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.87 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.50గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.86గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.76గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.56ఉండగా.. డీజిల్ ధర రూ.98.95గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.30 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.87 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.05గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.30లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.17గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.14 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.72గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.30 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.87లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

ఇవి కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఖాతాలో కొత్త శత్రువు.. ఈయన చాలా స్పెషల్ గురూ!

Grand Welcome: టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అంబరాన్నంటిన సంబరాలు

Latest Articles