AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఖాతాలో కొత్త శత్రువు.. ఈయన చాలా స్పెషల్ గురూ!

Pawan Kalyan: పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత... ఆయనకు రాజకీయ శత్రుత్వాలు ఏర్పడ్డం సహజం. తిట్టుకోవడాలూ, ఆ తిట్లను మర్చిపోవడాలూ కామన్. కానీ..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఖాతాలో కొత్త శత్రువు.. ఈయన చాలా స్పెషల్ గురూ!
Pawan Kalyan
Janardhan Veluru
|

Updated on: Aug 09, 2021 | 1:46 PM

Share

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత… ఆయనకు రాజకీయ శత్రుత్వాలు ఏర్పడ్డం సహజం. తిట్టుకోవడాలూ.. ఆ తిట్లను మర్చిపోవడాలూ కామన్. కానీ.. పవన్ తో సైద్ధాంతికంగా విభేదించి రచ్చకెక్కిన వాళ్ళు సినిమా లోపలా బయటా చాలామందే వున్నారు. కొందరు తెగేదాకా లాగితే.. మరికొందరు మిడిల్ డ్రాప్ అయ్యారు. ఆ జాబితాలో కొత్తగా చేరారు.. పేరున్న పెద్ద మనిషి.. నేరుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తో యుద్ధానికి దిగేసి.. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. మరి.. ఆయన క్లయిమాక్స్ కూడా మిగతా వాళ్లలాగే ఉంటుందా? వేరేలా ఉంటుందా? అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఇంతకీ ఎవరా బిగ్ మాన్?

ఫిలిం జర్నలిస్టుగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా రాని క్రేజ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి శత్రువు అనే ఒకే ఒక్క ట్యాగ్ తో సొంతం చేసుకున్నారు కత్తి మహేష్. పవన్ పొలిటికల్ అరంగేట్రం మీటింగ్ వైజాగ్ లో పెడితే అక్కడికెళ్ళి మరీ ప్రొటెస్ట్ చేయబోయారు. టీవీ ఛానెళ్ల రచ్చబండల మీదకెక్కి సారీ అడిగినా లొంగలేదు. పీకే అభిమాన సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొని నిలబడ్డ ఏకైక వ్యక్తి కూడా కత్తి మహేషే. ఆఖరికి యాక్సిడెంట్ లో చనిపోతే… సానుభూతి తెలపడంతో సర్ కాస్టిజం చూపారంటే.. అతడి మీద పీకే ఫ్యాన్స్ కి ఎంత ఆగ్రహం ఉందో తెలుసుకోవచ్చు.

వివాదాస్పద నటి శ్రీరెడ్డిది కూడా పవన్ శత్రుగణంలో మేజర్ వాటానే. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య మీద పోరాటం మొదలుపెట్టి.. అదే సీక్వెన్స్ లో పవన్ మీద ఆరోపణలు చేసి.. వార్తల్లోకెక్కారు. మిడిల్ ఫింగర్ చూపి చేసిన ఎలిగేషన్స్ పవర్ స్టార్ కాంపౌండ్ ని కార్నర్ చేశాయి. ఆ క్రమంలో ఆమెని, ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డ శక్తుల్ని నిలదీయడానికి పవన్ కల్యాణే రోడ్డు మీదకొచ్చేశారు. అప్పటికి ఆ ఇష్యు సద్దుమణిగినా.. తర్వాత కూడా ఆమె పవన్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో కీచులాటలకు దిగుతూనే వున్నారు.

పవన్ తో సన్నిహితంగా మెలిగి.. తర్వాత పక్కకు జరిగిన వాళ్ళు కూడా చాలామందే వున్నారు. పారిశ్రామికవేత్త పీవీపీ నుంచి, నటుడు అలీ దాకా ఆ జాబితా కూడాపెద్దదే . అలాగే… యాంటీ పవన్ బ్యాచ్ లో నయా ఎంట్రీ అయ్యారు పరకాల ప్రభాకర్. వృత్తి పరంగా, కుటుంబ పరంగా ఎంతో గౌరవప్రదమైన బ్యాక్ గ్రౌండ్ వున్న పరకాల.. తెలుగులో టాప్ ఇంటలెక్చువల్స్ జాబితాలో ఒకరు. కానీ.. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గిల్లికజ్జాలకు దిగడం ఒక ఆసక్తికరమైన తాజా పరిణామం. రెండుచోట్ల నిలబడితే ఒకటి కూడా గెలిపించుకోలేక పోయారు అంటూ ట్విట్టర్లో డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టిన పరకాల.. అటువైపు నుంచి కౌంటర్లు మొదలవడంతో… తానూ హుందాతనాన్ని మరిచి కాస్త కిందకు దిగేశారు.

లోతట్టు గ్రాంథికంలో వున్న తెలుగు తిట్లన్నిటినీ ఏరుకొచ్చి పవన్ ఫ్యాన్స్ మీద ప్రయోగిస్తున్నారు. పిత్త పరిగి సైన్యం లాంటి విచిత్రమైన బూతులతో… ట్రోలింగ్ లో కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పరకాల. మీ మీద మాకు చాలా గౌరవం వుంది.. దాన్ని కూడా పోగొట్టుకోకండి అంటూ పవన్ ఫ్యాన్స్ లో కొందరు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నా పరకాల మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

2009లో కాంగ్రెసోళ్ల పంచెలూడగొడతానని… అదే కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు? 2014 లో సైకిల్‌ ఎందుకు ఎక్కినట్టు..? 2017 లో పాచిపోయిన లడ్డూ అన్నవారు తర్వాత కమలం పువ్వు చెవిలో ఎందుకు పెట్టుకున్నట్టు? అని పొలిటికల్ కామెంట్లు చేస్తూనే… కొత్త రకం బూతుల్ని వెతకడంలో తన మేధావి బుర్రను ఇతోధికంగా వాడేస్తున్నారు. మీరు అలసిపోయినా నేను ఆగబోను అంటూ సోషల్ మీడియాలో పవన్ సేన సహనాన్ని పరీక్షిస్తున్నారు పరకాల ప్రభాకర్. ఒకవైపు పేరున్న పోర్టల్స్ కి జాతీయ-అంతర్జాతీయ అంశాలపై గొప్పగొప్ప ఆర్టికల్స్ రాస్తూ.. తన మేధావితనాన్ని చాటుకుంటూనే.. మరో చేత్తో ఇలా చిల్లర కొట్లాటకు దిగుతున్నారు.

Parakala Prabhakar

Parakala Prabhakar

గతంలో ప్రజారాజ్యానికి తూట్లు పొడిచింది.. మా అన్నయ్యకు వెన్నుపోటు పొడిచింది పరకాల లాంటి వాళ్ళే. అటువంటి వాళ్ళను మళ్ళీ దగ్గర చేర్చుకుని నేను పొరపాటు చెయ్యను అని.. పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల కిందట ఓపెన్ డయాస్ పై చెప్పారు. తద్వారా కలిగిన కోపాన్ని పరకాల.. ఈ విధంగా సీజనల్ గా అప్పుడప్పుడూ తీర్చుకుంటున్నారా? ఈవిధంగా ఆయనకు ఏం దక్కినా దక్కకపోయినా… తనకున్న మేధావి అనే ముద్రను మాత్రం కొద్దిగానైనా కోల్పోతారేమో కదా!

– రాజా శ్రీహరి, TV9 ET డెస్క్

Also Read..

ఆర్ఆర్ఆర్ సెట్లో గందరగోళం.. సీరియస్ అయిన రామ్ చరణ్.. కారణం ఏంటో తెలుసా..

ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..