RRR Movie: ఆర్ఆర్ఆర్ సెట్లో గందరగోళం.. సీరియస్ అయిన రామ్ చరణ్.. కారణం ఏంటో తెలుసా..

దర్శక ధీరుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే...

RRR Movie: ఆర్ఆర్ఆర్ సెట్లో గందరగోళం.. సీరియస్ అయిన రామ్ చరణ్.. కారణం ఏంటో తెలుసా..
Rrr.
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 1:34 PM

RRR Movie: దర్శక ధీరుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సినిమాపై అంచనాలు పెంచాలన్నా.. సినిమాను ప్రమోట్ చేయాలన్నా.. ద వన్‌ అండ్ ఓన్లీ జక్కనకే క్రెడిత్ అంతా చెల్లుతుంది. సినిమాను తెరకెక్కించడంలోనే కాదు.. సినిమా పై అంచనాలను పెంచడంలోనూ… తనదైన ముద్ర వేసే రాజమౌళి ఇప్పుడో మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఇంటర్య్వూలు, ఇన్‌స్టా స్టేటస్‌లు.. థీమ్ పోస్టర్లే కాదు.. ట్రిపుల్ ఆర్‌ అఫీషియల్ ఇన్‌స్టాను ఎన్టీఆర్‌కు అప్పజెప్పారు. అప్పజెప్పడమే కాదు.. కొన్ని రోజులు ట్రిపుల్ ఆర్‌ ఇన్‌స్టా ఎన్టీఆర్‌కే సొంతం అని అనౌన్స్‌ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. అంటే ఎలాంటి పోస్ట్ పెట్టినా.. ఎలాంటి అప్‌డేట్ ఇవ్వాలన్నా అది ఎన్టీఆర్‌ ఇష్టమేనని.. చెప్పకనే చెప్పారు.

అలా అకౌంట్‌ను హ్యాండోవర్‌ చేశారో లేదో.. అప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా ఓ వీడియోను పోస్ట్ చేసేశారు. అల్లూరి సీతారామరాజు అలియాస్ రామ్‌చరణ్‌ను డ్రమ్స్‌ ప్రాక్టీస్‌ చేశావా అని అడుగేస్తూ.. ఓ వీడియో తీశారు. దానికి ఏంటయ్యా కారు.. ఓ డ్రెస్సు లేదు.. డ్రమ్స్‌ లేవు.. దసరాకి సినిమా అవుతుందా లేదా అన్నట్టు కాస్త సీరియస్‌గా జక్కన్న కొడుకును అడిగేశారు. అయితే ఎప్పటిలానే ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ట్రిపుల్ ఆర్‌పై అదే  ఆసక్తి  కంటిన్యూ అయ్యేలా చేస్తోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..