- Telugu News Photo Gallery Science photos The Story of Saturn Rings The special feature of Saturn rings disappearing Know what is happening to them
Saturn Rings: శని గ్రహాన్ని ప్రత్యేకంగా కనిపించేలా చేసే వలయాలు కరిగిపోతున్నాయి..ఎందుకో తెలుసా?
గ్రహాలన్నిటిలో ప్రత్యేకంగా కనిపించే శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు క్రమేపీ అదృశ్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎన్నిరోజుల్లో ఆ వలయాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది? ఈ విషయాలు తెలుసుకుందాం.
Updated on: Aug 10, 2021 | 2:24 PM

ఖగోళ శాస్త్రంలో మనకి విశ్వంలోని గ్రహాల గురించి చాలా విషయాలు కనిపిస్తాయి. వీటిలో శని గ్రహం ప్రత్యేకతే వేరు. మనదేశంలో ఆధ్యాత్మికంగా కూడా గ్రహాల గురించి చెబుతారు. అందులో కూడా శని గ్రహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ ఆధ్యాత్మిక విషయాల మాట ఎలావున్నా.. సైన్స్ పరంగా చూస్తే కనుక శని గ్రహం అన్ని గ్రహాల్లోకీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

శని గ్రహం దాని చుట్టూ కనిపించే అతిపెద్ద వలయం కారణంగా గుర్తించదగిన గ్రహాలలో ఒకటిగా నిలిచింది. శని గ్రహం రింగ్ దాని భూమధ్యరేఖ నుండి 6,630 నుండి 120,700 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. సుమారు 20 మీటర్లు (66 అడుగులు) మందంతో ఉంటుంది. అయితే, ఈ వలయాలు ఇప్పుడు కనుమరుగు కాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శని గ్రహం 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. కానీ దాని వలయాలు కేవలం 100-200 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఈ ఉంగరం లాంటి వలయాలు మైక్రోస్కోపిక్ డస్ట్ గ్రెయిన్స్ సైజు నుండి అనేక గజాల పెద్దవైన బండరాళ్ల వరకు నీటి మంచుతో తయారు అయ్యాయి. రింగ్ కణాలు వాటిని తిరిగి గ్రహం లోకి ఆకర్షించాలనుకునే శని గురుత్వాకర్షణ లాగే క్రమంలో.. వాటి కక్ష్య.. వేగం మధ్య సమతౌల్య చర్యలో చిక్కుకున్నాయి. అంటే ఇవి అటు రోదసిలోనూ కలిసిపోలేవు.. ఇటు శని గ్రహంతోనూ కలవలేవు. అందుకే ఈ వలయాలు శని గ్రహం చుట్టూ ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ప్రస్తుతం, సెకనుకు శని మీద 10,000 కిలోగ్రాముల రింగ్ వర్షం కురుస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే. అరగంటలో ఒలింపిక్ సైజు పూల్ నింపడానికి అవసరమైనంత వేగంగా. 300 మిలియన్ సంవత్సరాలలో శని తన ఉంగరాన్ని కోల్పోతుందని గతంలో అంచనా వేశారు. అయితే, నాసా కాస్సిని అంతరిక్ష నౌక చేసిన కొత్త పరిశీలనల ప్రకారం,100 మిలియన్ సంవత్సరాలలో ఈ శని ఉంగరాలు మాయం అయిపోతాయి. ఈ దృగ్విషయానికి సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కాంతి బాధ్యత వహిస్తుంది కాబట్టి, సూర్యకాంతిలో వచ్చే మార్పులు రింగ్ వర్షం పరిమాణాన్ని కూడా మారుస్తుంది.

సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కాంతి కారణంగా శని తన ఉంగరాన్ని కోల్పోతున్నాడు. సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కాంతి ద్వారా రింగులలోని కణాలు బాంబుల్లా పేలతాయి. దీంతో ఆ కణాలు విద్యుదావేశం చెందుతాయి. దీంతో శని గ్రహం.. వలయాల కక్ష్య వేగం మధ్య సమతుల్యత తీవ్రంగా మారుతుంది. శని గురుత్వాకర్షణ ఈ వలయ కణాన్ని దాని వాతావరణంలోకి లాగుతుంది. ఇలా శని వాతావరణంలోకి రింగ్ కణాలు లాగడం జరిగితే.. ఆ కణం ఆవిరై పోయి వర్షంలా శని గ్రహం మీదకు పడిపోతుంది.



