- Telugu News Photo Gallery Science photos World Smallest Baby born with 223 grams weight discharged from hospital after 13 months with 6.3 kg weight
World Smallest Baby: ఆ చిన్నారి పుట్టినపుడు యాపిల్ అంత బరువు కూడా లేదు.. పదమూడు నెలల తరువాత..ఎలా ఉందంటే..
ప్రపంచంలోనే అతిచిన్న ఆడ శిశువు ఆసుపత్రిలో 13 నెలల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకుంది.
Updated on: Aug 09, 2021 | 9:46 PM

సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో 9 జూన్ 2020 న క్వెక్ యు జువాన్ అనే శిశువు జన్మించింది. పుట్టినప్పుడు ఆమె బరువు 212 గ్రాములు. అంటే, ఒక ఆపిల్ బరువు. తరువాత జూలై 9 న, డిశ్చార్జ్ సమయంలో, జువాన్ బరువు 6.3 కిలోలు.

క్వెక్ యు జువాన్ పుట్టినప్పుడు ఊపిరితిత్తులు కూడా సరిగా అభివృద్ధి చెందలేదు. అందుకే ఆమె వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోలేకపోయింది. ఆమె చర్మం కూడా చాలా సున్నితంగా ఉండేది. ఆ చిన్నారి శరీరంలో ట్యూబ్‌లు పెట్టడం చాలా కష్టమయ్యేది నర్సులు చెప్పారు. ఈ చిన్నారి తొడ నర్సు చేతివేళ్ల సైజులో ఉండేది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు..

బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తీసుకువచ్చినప్పుడు, డాక్టర్ జాంగ్ సుహే తన కళ్లను తానే నమ్మలేకపోయారు. తన 22 సంవత్సరాల కెరీర్‌లో, తాను ఇంతకు ముందు ఇలాంటి కేసును చూడలేదని ఆయన అన్నారు.

బేబీ జువాన్ తండ్రి పేరు క్వాక్ వీ లియాంగ్, తల్లి పేరు వాంగ్ మెయి లింగ్. ఇద్దరి వయస్సు 35 సంవత్సరాలు. అకస్మాత్తుగా నొప్పి రావడంతో తల్లి సింగపూర్‌లో ఆడ శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చింది.

ఈ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2 కోట్ల 23 లక్షలు. సేకరించారు. 1 కోటి 48 లక్షల రూ. ఆమె చికిత్స కోసం ఖర్చు అయ్యాయి. మిగిలిన డబ్బు భవిష్యత్తు వైద్య ఖర్చుల కోసం కేటాయించారు.



