Xiaomi OLED TV: మరో సంచలనానికి సిద్ధమవుతోన్న షియోమీ.. అదిరిపోయే గ్యాడ్జెట్స్‌ విడుదలకు సిద్ధమైన టెక్‌ దిగ్గజం.

Xiaomi OLED TV: ఎలక్ట్రానిక్స్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది చైనాకు చెందిన ప్రముఖ సంస్థ షియోమీ. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి మొదలు టీవీలు, ఇయర్ ఫోన్స్‌ వరకు అన్ని రకాల గ్యాడ్జెట్లను...

Xiaomi OLED TV: మరో సంచలనానికి సిద్ధమవుతోన్న షియోమీ.. అదిరిపోయే గ్యాడ్జెట్స్‌ విడుదలకు సిద్ధమైన టెక్‌ దిగ్గజం.
Xiaomi
Follow us

|

Updated on: Aug 10, 2021 | 12:00 PM

Xiaomi OLED TV: ఎలక్ట్రానిక్స్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది చైనాకు చెందిన ప్రముఖ సంస్థ షియోమీ. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి మొదలు టీవీలు, ఇయర్ ఫోన్స్‌ వరకు అన్ని రకాల గ్యాడ్జెట్లను విడుదల చేస్తూ వస్తోంది. అంతేకాకుండా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను యూజర్లకు అందిస్తూ మార్కెట్‌ను హస్తగతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే షియోమీ బడా కంపెనీలకు టఫ్‌ పోటీనిస్తోంది. తాజాగా యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టి షియోమీ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని అద్భుతాలను సృష్టించేందకు షియోమీ సిద్ధమైంది. మంగళవారం సరికొత్త గ్యాడ్జెట్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న కార్యక్రమంలో షియోమీ ఎమ్‌ఐ మిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌, ఎమ్‌ఐ ప్యాడ్‌ 5 ట్యాబ్‌తో పాటు ఓఎల్‌ఈడీ టీవీని లాంచ్‌ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని కంపెనీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు, వెబ్‌సైట్‌లో టెలికాస్ట్‌ చేయనుంది. షియోమీ విడుదల చేయనున్న ఈ గ్యాడ్జెట్‌ల ఫీచర్లు (అంచనా) ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..

Mix

 

ఎమ్‌ఐ మిక్స్‌ 4:

* షియోమో ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అండర్‌ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా తీసుకురానుంది. * 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే. * క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888+ ఎస్‌ఓసీ ప్రాసెసర్. * 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా. 128 జీబీ ర్యామ్‌ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Mi Pad

 

ఎమ్‌ఐ ప్యాడ్‌ 5:

* ఎమ్‌ఐ ప్రవేశపెట్టనున్న కొత్త ట్యాబ్‌లెట్‌ ఎమ్‌ఐ ప్యాడ్ 5లో అక్టో కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌ ఉండనున్నట్లు సమాచారం. * 6జీబీ ర్యామ్‌తో తీసుకు రానున్న ఈ ట్యాడ్‌ ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తంది. * 10.95 అంగుళాల 120హెడ్జ్‌ డిస్‌ప్లే. * సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌. * 20 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా. 65 వాట్స్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేసే.. 8720 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

Mi Oled

 

ఎమ్‌ఐ ఓఎల్‌ఈడీ టీవీ:

* అందరి చూపు ఎమ్‌ఐ ప్రకటించనున్న ఓఎల్‌ఈడీ టీవీపై ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు పెద్ద పెద్ద కంపెనీలకే సాధ్యమైన ఈ టీవీలను షియోమీ తీసుకువస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. * ఈ టీవీ 55 ఇంచెస్‌, 65 ఇంచెస్‌, 77 ఇంచెస్‌ వెర్షన్‌లో రానున్నట్లు సమాచారం. * ఇందులో గేమింగ్‌ అనుభూతిని అందించేందుకు ప్రత్యేక ఫీచర్‌ను తీసుకురానున్నారు. * ఈ టీవీలో అల్ట్రా హెచ్‌డీ 4కే డిస్‌ప్లేను అందించనున్నారు. * ఆండ్రాయిడ్‌ ఆధారంగా నడిచే ఈ టీవీలో క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ను వాడనున్నారని సమచారం. వీటిపై ఓ క్లారిటీ రావాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.

Also Read: Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి మరో షాక్.. ఆమెతోపాటు.. తల్లిపై చీటింగ్‌ కేసు

Virat Kohli Workout: గేర్ మార్చిన టీమిండియా కెప్టెన్.. వెయిట్ లిఫ్టింగ్‌‌తో కుస్తీ.. వైరలవుతోన్న వీడియో

Viral Pic: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..