Paagal Trailer: ఏకంగా 1600 మంది అమ్మాయిలను లవ్ చేసిన విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న ‘పాగల్’ ట్రైలర్..
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తున్న లెటేస్ట్ సినిమా పాగల్. ఇందులో నివేదా పేతురాజ్
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తున్న లెటేస్ట్ సినిమా పాగల్. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స వేగవంతం చేసింది చిత్రయూనిట్. విశ్వక్ సేన్ ఫస్ట్‌లుక్ దగ్గర్నుంచి.. టీజర్ వరకు ప్రేక్షకులకు ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా పాగల్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
నా పేరు ప్రేమ్… నేను 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఇక ఇక్కడ గీత ఎక్కడ ఉంటది సర్ అని ప్రశ్నించగా.. తన లిస్ట్‌లో ఉన్న గీత పేర్లను చెప్పేస్తుంటాడు. కనిపించిన ప్రతి అమ్మాయికి లవ్ యూ చెప్పుకుంటూ గులాబీలు ఇస్తూ కనిపిస్తుంటాడు విశ్వక్.. అంటే ఈ సినిమాలో విశ్వక్ లవర్ బాయ్‌గా అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. నువ్వు ఏ అమ్మయిని ప్రేమిస్తున్నావో.. ఏ అమ్మాయిని ప్రేమించట్లేదో తెలియక.. మేం అమ్మాయిలను ఏడిపించడమే మానేశాం అంటూ రాహుల్ రామకృష్మ చెప్పే డైలాగ్ నవ్విస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. విశ్వక్ సేన్‌కు కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం వేరు, నచ్చిన అమ్మాయిని లవ్ చేయడం వేరు అనే క్లారిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, మురశీ శర్మ, జబర్ధస్త్ మహేష్, ఇంద్రజ శంకర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా.. రథన్ సంగీతం అందించారు. ట్రైలర్‌తోనే యూత్‌ను ఆకట్టుకుంటున్న విశ్వక్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
ట్వీట్..
Mass ka Dass @VishwakSenActor’s #PaagalTrailer?
IN THEATRES ON AUGUST 14TH#PaagalOnAug14th #Paagal@Nivetha_Tweets @SimranCOfficial #MeghaLekha@SVC_official @NaresshLee @maniDop @radhanmusic @Garrybh88 @BekkemVenugopal @luckymediaoff @adityamusic pic.twitter.com/iESG161Nyx
— Sri Venkateswara Creations (@SVC_official) August 10, 2021