Chiranjeevi: “మా”లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ

"మా " లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్‌గా అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటంపై...

Chiranjeevi: మాలో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ
Chiranjeevi
Follow us
Ram Naramaneni

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 09, 2021 | 9:41 PM

“మా ” లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్‌ అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటంపై ఆయన ఫైర్ అయ్యారు. దీనికి కారకులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ “మా ” క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరంజీవి లెటర్ రాసారు. “మా ” ఎన్నికల వివాదం ప్రారంభమైన నాటి నుంచి చిరంజీవి స్తబ్ధుగా ఉన్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌కు మద్దతు పలికారు. దీంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకే అని అర్థం అయ్యింది. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరిగే విషయంపై క్లారిటీ రాలేదు. ఈలోగా పోటీలో ఉన్న వారు.. వారికి మద్దతిస్తున్న వారు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

తాజాగా హేమ వాయిస్ మెసేజ్.. దానికి “మా ” ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, జీవితల కౌంటర్లతో విమర్శల పర్వం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో  క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరు లేఖ రాశారు. “మా ” ఎన్నికలు వెంటనే జరపాలంటూ చిరంజీవి అందులో కోరారు. “మా ” ప్రతిష్ట దెబ్బ తీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ క్రిష్ణంరాజుకు సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా.. సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ఠ మసక బారుతోందని లేఖలో ప్రస్తావించారు. “మా ” ఎన్నికల వ్యవహారంలో చిరంజీవి లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కాగా ఈసారి “మా ” ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అయిదుగురు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, నరసింహారావు ఈ పోటీలో ఉన్నారు.

చిరంజీవి రాసిన లెటర్ దిగువ ట్వీట్‌లో చూడండి:

Also Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం