AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అనుహ్యంగా భరతుడిని కలిసిన పుష్పరాజ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ అనంతరం స్టార్ట్ అయిన

Allu Arjun: అనుహ్యంగా భరతుడిని కలిసిన పుష్పరాజ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2021 | 7:24 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ అనంతరం స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్.. ఇటీవల సుకుమార్ అనారోగ్యం కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీంతో వీలైనంత తొందరగా పుష్ప మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న పుష్ప చిత్రీకరణలో అల్లు అర్జున్ జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బన్నీ డాటర్ అల్లు అర్హ కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తోంది అర్హ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది.

అయితే తాజాగా వీరిద్దరి షూటింగ్ లోకేషన్స్ పక్క పక్కనే ఉండడంతో బన్నీ మరోసారి శాకుంతలం సెట్‏లోకి అడుగు పెట్టారు. తన కూతురి నటన చూసి మురిసి పోవడమే కాకుండా.. ఇలాంటి రోజు ఇంత తర్వగా వస్తుందనుకోలేదు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తండ్రీ కూతురు ఇలా పక్క పక్కనే షూటింగ్ చేస్తామని అనుకున్నాను. కానీ 15-20 సంవత్సరాల తర్వాత ఆ రోజు వస్తుందనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఆ రోజు వస్తుందనుకోలేదు. శాకుంతలంలోని భరతుడిని పుష్ప ఇలా కలిశాడు. ఇది అద్భుతమైన కలయిక అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కూతురు అర్హను ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్వీట్..

ఇటీవల బన్నీ తన కుటుంబంతో కలిసి శాకుంతలం సెట్‏లో సందడి చేశారు. అక్కడ తన ముద్దుల కూతురు అర్హ నటన చూసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read:

Follow Us
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..