AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB28: మహేష్‏ బర్త్ డే వేళ హీరోయిన్‏ను రివీల్ చేసిన త్రివిక్రమ్.. సూపర్ స్టార్ సరసన ఎవరంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

SSMB28: మహేష్‏ బర్త్ డే వేళ హీరోయిన్‏ను రివీల్ చేసిన త్రివిక్రమ్.. సూపర్ స్టార్ సరసన ఎవరంటే..
Mahesh Trivikram
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2021 | 6:58 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‏లో హ్యాట్రిక్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచాయి. దీంతో మరోసారి త్రివిక్రమ్, మహేష్ కాంబో రాబోతుండడంతో ఫ్యాన్స్ మరో సూపర్ హిట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ‘#SSMB28’ అనే వర్కింగ్ టైటిల్‏తో అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్‏తోపాటు.. టెక్నికల్ టీమ్‏ను పరిచయం చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ సినిమాలో మహేష్‏కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. గతంలో పూజా.. మహేష్‏ సరసన మహర్షి సినిమాలో నటించింది. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్‏లో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి మహేష్‏కు జోడిగా నటించబోతుంది. అలాగే అల వైకుంఠపురంలో సినిమాకు మ్యూజిక్ అందించిన ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు. ఇక ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‏గా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్‏గా.. మది సినిమాటోగ్రాఫర్‏గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని మేము మీకు #SSMB28 యొక్క సూపర్ స్క్వాడ్ ను అందిస్తున్నాము. త్రివిక్రమ్ మంత్రముగ్ధమైన కథ త్వరలో సెట్స్ పైకి రానుంది అని పేర్కొన్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా పూర్తైన తర్వాత ఈ హ్యాట్రిక్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Nagababu: రతన్ టాటాపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. వైరల్‏గా మారిన ట్వీట్..

Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..

Arjun Kapoor: మలైకా సంపాదనపై అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఇలాంటివి చూడడం సిగ్గుచేటు అంటూ..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..