Nagababu: రతన్ టాటాపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. వైరల్‌గా మారిన ట్వీట్..
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. ఫ్యామిలీ విషయాలు, సినిమా విషయాలతోపాటు..
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. ఫ్యామిలీ విషయాలు, సినిమా విషయాలతోపాటు.. సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఇటీవల మా ఎన్నికలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ తాజాగా రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులలో ఉందని.. ఇలాంటి పరిస్థితులలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి.. అది కూడా దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్ రతన్ టాటా కావాలని కోరుతూ సోమవారం ట్వీట్ చేశారు. దీంతో నాగబాబు చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
వచ్చే ఏడాది ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ పదవి కాలం ముగుస్తుంది. అయితే ఆయన తర్వాత దేశ అధ్యక్షుడిగా ఎవరుంటారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వచ్చినా.. అవి సందేహంగానే ఉండిపోయాయి. రాష్ట్రపతిగా ఎవరు ఉండబోతున్నారనే దానిపై ఇంతవరకు ఎవరు అధికారికంగా ట్వీట్ చేయలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు రాష్ట్రపతి అంశంపై ట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం మన దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు వేసే వ్యక్తులు కాకుండా.. దేశాన్ని కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి అయితే బాగుంటుంది. అందుకే రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి రతన్ టాటా గారు అంటూ నాగబాబు ట్వీట్ చేస్తూ.. #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు. అయితే ఇన్నాళ్లు మా ఎన్నికలపై స్పందిస్తూ వచ్చిన నాగబాబు ఉన్నట్టుండి రాష్ట్రపతి పదవి గురించి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ట్వీట్..
View this post on Instagram
Also Read: Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..
Arjun Kapoor: మలైకా సంపాదనపై అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఇలాంటివి చూడడం సిగ్గుచేటు అంటూ..
Juhi Chawla: ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. మీరే తేల్చాలంటూ పిలుపు..