Juhi Chawla: ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. మీరే తేల్చాలంటూ పిలుపు..

ఇటీవల కొద్ది నెలల క్రితం దేశంలో 5G టెక్నాలజీ అమలు చేయవద్దని బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన

Juhi Chawla: ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. మీరే తేల్చాలంటూ పిలుపు..
Juhi Chawla
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 4:01 PM

ఇటీవల కొద్ది నెలల క్రితం దేశంలో 5G టెక్నాలజీ అమలు చేయవద్దని బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. జూహ్లీ వాదనను తోసిపుచ్చింది. కేవలం పబ్లిసిటీ కోసమే జూహ్లీ చావ్లా 5జీకి వ్యతిరేకంగా పోరాడుతుందన తెలిపింది. అలాగే కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు గానూ ఆమెకు జరిమానా కూడా విధించింది. దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ జూహీ చావ్లాకు వ్యతిరేకంగా అనేక కామెంట్స్ వచ్చాయి. అయితే వీటిపై ఇన్నాళ్లు నిశబ్ధంగా ఉన్న హీరోయన్ ఎట్టకేలకు మౌనం వీడారు. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను కేవలం పబ్లిసిటీ స్టంట్ అని.. కోర్టు సమయం వృథా అంటూ తన పిటిషన్ తిరస్కరించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు సంబంధించిన తన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం పై స్పందిస్తూ.. సోమవారం జూహీ చావ్లా తన ఇన్‏స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో జూహీ మాట్లాడుతూ.. మనుషులకు, జంతువులు, 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పపరిణామాలపై ఎంతవరకు సురక్షితమని చెప్పాలని ఆర్టీఐతోపాటు, మరికొన్ని ఏజెన్సీలను కూడా అడగామని.. ఆ వివరాలను మీరు కూడా పరిశిలించాలని.. ఓపికగా తను పోస్ట్ చేసిన వీడియోను గమనించాలని కోరారు.. అలాగే ఆ వీడియో తన 11 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ముఖ్యమైన, దిగ్ర్భాంతికరమై విషయాలను తెలియచేసినట్టుగా జూహ్లీ చావ్లా అన్నారు. వీడియోలో జూహీ చావ్లా మాట్లాడుతూ.. 5జీ టెక్నాలజీ వలన మనుషులు, మూగ జీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

Also Read: Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..