Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంటుందో తెలిసిందే. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు కావడంతో

Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 5:22 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంటుందో తెలిసిందే. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు కావడంతో రెండు రోజుల ముందు నుంచే నెట్టింట్లో మహేష్ మేనియా మొదలైంది. ఇక అర్ధరాత్రి విడుదలైన సర్కారు వారి పాట టీజర్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక పలువురు సెలబ్రెటీల నుంచి దర్శకనిర్మాతల వరకు సోషల్ మీడియా వేదికగా మహేష్‏కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈక్రమంలోనే ఇప్పుడు నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ సరికొత్త వివాదానికి తెరతీశాయి.

కేవలం తెలుగులోనే కాకుండా.. మహేష్‏కు తమిళ్, మలయాళం, కన్నడలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ సినిమాలు దక్షిణాదిలో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే.. అయితే వివాదాలకు కేరాఫ్‏గా మారిన కస్తూరీ శంకర్ మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ట్వీట్‏తో నెట్టింట్లో రచ్చ మొదలైంది. సెలబ్రెటీల నుంచి రాజకీయ నేతల వరకు కస్తూరీ చేసే కామెంట్స్ ఎప్పుడూ వివాదాలకు దారితీస్తుంటాయి. గతంలో రజినీ అమెరికా టూర్ పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కస్తూరీ ఇప్పుడు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్‏ను కించపరిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కస్తూరీని ఆడుకుంటున్నారు.

Kasturi

Kasturi

కస్తూరీ తన ట్విట్టర్ ఖాతాలో.. తమిళనాడులో మహేష్ బాబును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆయన సినిమాలను ఇక్కడ విజయ్ రీమేక్ చేస్తుంటారు. అయినా కానీ తమిళ అభిమానులు మహేష్ ఒరిజినల్ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు అంటూ ట్వీట్ చేశారు. అయితే కస్తూరీ విషెస్ చెప్పడం వరకు సరే.. కానీ తమ హీరో పేరును ప్రస్తావించడం ఏంటని ? దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే విజయ్ రీమేక్ స్టార్ అన్నట్లుగా కస్తూరీ ట్వీట్ చేసిందని మండిపడుతున్నారు. కేవలం పోకిరి, ఒక్కడు సినిమాలను మాత్రమే విజయ్ రీమేక్ చేశారని తెలిపారు. కస్తూరీ తమిళ్ యాక్టర్స్ నచ్చదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Arjun Kapoor: మలైకా సంపాదనపై అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఇలాంటివి చూడడం సిగ్గుచేటు అంటూ..

Juhi Chawla: ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. మీరే తేల్చాలంటూ పిలుపు..