AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని...

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ
Minister Adimulapu Suresh
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2021 | 5:43 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు.  16వ తేది పాఠశాలలు ప్రారంభం రోజునే పిల్లలకి జగనన్న విద్యా కానుక అందజేస్తామని చెప్పారు. విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. 15వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మొదటి దశ నాడు-నేడును 16వ తేది ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామన్నారు.  విద్యాశాఖలో నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామని, ఆ కారణం చేత ఏ ఒక్కరి పోస్ట్ పోదని, అదనంగా ప్రమోషన్స్ ఉంటాయని మంత్రి చెప్పారు. ఏ ఒక్క పాఠశాలను మూసివేయమని, అవసరం అయితే నూతన పాఠశాలలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.  ఇక  గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ తీవ్రం కృష్టి చేస్తోందని మంత్రి చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 45 కోట్ల రూపాయల నిధులతో డోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా  కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూల్స్ పున:ప్రారంభం చేయాలని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా  సూచించారు. దాదాపు ఏడాదిన్నరగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్ క్లాసుల కంటే భౌతికంగా స్టూడెంట్స్ క్లాసులకు హాజరైతేనే ప్రయోజనమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. అయితే స్కూల్స్ రీఓపెన్  చేసే సమయంలో  కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

Also Read:  పరమశివుడికి అత్యంత ప్రియమైన నంది విగ్రహాన్నే దొంగిలించిన దుండగులు..

మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఊర్మిళ గజపతి రాజు