MANSAS trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఊర్మిళ గజపతి రాజు

మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అశోక్ గజపతి రాజును‌ ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి, తనను నియమించాలని...

MANSAS trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఊర్మిళ గజపతి రాజు
Urmila Gajapathi Raju
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 09, 2021 | 2:38 PM

మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అశోక్ గజపతి రాజును‌ ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి, తనను నియమించాలని కోరుతూ ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తనను, సంచయితను వారసులుగా గుర్తించిందని ఆమె కోర్టుకు విన్నవించారు. సంచయిత కానీ పక్షంలో తనను చైర్మన్‌గా నియమించాలని ఆమె కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా  ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ప్రభుత్వం గతేడాది మార్చిలో నియమించింది. అయితే వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టులో వయస్సులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని..ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ట్రస్టుల ఛైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతిరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అశోక్ గజపతిరాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సంచయిత నియామక ఉత్తర్వుల్ని కొట్టివేసింది. ట్రస్టు చైర్మన్‌గా తిరిగి అశోక్ గజపతిరాజును నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్టచివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరాం గజపతి రాజు (పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్‌(మాన్సాస్)ను 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. విద్య, సంగీతం, సంస్కృతిలకు పెద్దపీట వేస్తూ ఈ మాన్సాస్ ట్రస్టు‌ను నెలకొల్పారు. మాన్సాస్ నిర్వహణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి మొత్తం దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు (ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి) పైగా విలువైన 14,800 ఎకరాల భూమి సాంకేతికంగా ఈ ట్రస్టు నియంత్రణలో ఉంది. ఇంతే కాకుండా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి.

Also Read: పిల్లిని రక్షించేందుకు మహిళ సాహసం.. 200 అడుగుల లోతు బావిలోకి దిగి

Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..