AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandi idol missing: పరమశివుడికి అత్యంత ప్రియమైన నంది విగ్రహాన్నే దొంగిలించిన దుండగులు..

పరమశివుడికి అత్యంత ప్రియమైనది నంది.. శివుడికి మొక్కకున్నాక.. ఆ నందికే మొక్కుకుంటాం. కోరుకున్న కోరికలు నెరవేరాలని..

Nandi idol missing: పరమశివుడికి అత్యంత ప్రియమైన నంది విగ్రహాన్నే దొంగిలించిన దుండగులు..
Nandi Idol Missing
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2021 | 4:44 PM

Share

పరమశివుడికి అత్యంత ప్రియమైనది నంది.. శివుడికి మొక్కకున్నాక.. ఆ నందికే మొక్కుకుంటాం. కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆ నందిశ్వరుడి చెవిలో మొర పెట్టుకుంటాం.. ఆ నంది విగ్రహాన్నే దొంగిలించిన దుండగులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గోలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిందీ ఘటన. రెండు రోజులుగా నంది విగ్రహం కనిపించడం లేదు. విషయం బయటకు రాకుండా  ఆలయ సిబ్బంది, ఆర్చకులు గోప్యంగా ఉంచారు. ఈ విగ్రహాం దొంగతనానికి గురికావడంతో.. శ్రావణమాసం సందర్భంగా గుడికి వచ్చే భక్తుల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఇక్కడ సెక్యురిటీ లేదా? ఉన్నా పట్టించుకునేవారు లేరా? .. చూసి చూడనట్టు వదిలేశారా..? అనే సందేహాలు స్థానికుల్లో వస్తున్నాయి.

ఈ బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి ఈవో కూడా ఉన్నారు. మరి దొంగతనం ఎలా జరిగింది?.. తెలిసినా వాళ్లే చేశారా?.. అసలు ఎందుకు దొంగతనం చేశారు?.. దేనికోసం దొంగతనం చేయాల్సి వచ్చింది?… తెలియాల్సి ఉంది?. నంది విగ్రహాం చోరీ ఘటనపై ఆర్చకులు, పూజారులతో చర్చలు జరిపింది ఆలయ కమిటీ. పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిటీ సభ్యులు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నంది విగ్రహాన్ని, దుండగులను కనిపెట్టేపనిలో పడ్డారు పోలీసులు. నంది విగ్రహాన్ని ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది..? నందిని తీసుకెళ్లి, ఏం చేస్తారు..? రాతినంది విగ్రహాంతో దొంగలించిన దుండగులు ఏం చేస్తున్నారు..? ఇవన్నీ మనకు వస్తోన్న డౌట్స్.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా.. జరుగుతున్న చోరీలపై పలు అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

Also Read: ఫేస్‌బుక్ స్నేహం, డబ్బు అవసరం, కిడ్నాప్, రెస్క్యూ.. సినిమాకు మించిన ట్విస్టులు

 కూతురు వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు.. పెద్దలు మందలించారు.. కట్ చేస్తే