AP Corona Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన రికవరీ.. కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఎంతంటే..?
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పెరగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు.. భారీగా తగ్గు ముఖం పట్టాయి.
andhra pradesh new coronavirus positive cases: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పెరగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు.. భారీగా తగ్గు ముఖం పట్టాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 54,455 మంది నమూనాలను పరీక్షించగా, 1413 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,83,721 కు చేరింది. ఇందులో 19,50,623 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. చిత్తూర్ జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 13,549 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,795 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,52,47,884 రోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా కోవిడ్ వ్యా్క్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.
ఇక, జిల్లాలవారీగా కరోనో కేసులు వివరాలు ఇలా ఉన్నాయి….