Hyderabad Cinema: ఇక థియేటర్లలో ఐదు షోలు.. సినిమా ఎగ్జిబిటర్ల వినతిపై తెలంగాణ సర్కార్ సానుకూలం!

విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమ‌ని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Hyderabad Cinema: ఇక థియేటర్లలో ఐదు షోలు.. సినిమా ఎగ్జిబిటర్ల వినతిపై తెలంగాణ సర్కార్ సానుకూలం!
Telangana Cinema Exhibitors Meeting
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 4:19 PM

Telangana Cinema Exhibitors Meeting: విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమ‌ని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. న‌గ‌రంలోని తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి త‌ల‌సాని అధ్యక్షతన మంగ‌ళ‌వారం స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకునేందుకు 5వ షో ప్రద‌ర్శన‌కు అనుమ‌తివ్వాలని ఎగ్జిబిటర్లు మంత్రిని కోరారు. దీంతో 5వ షోకు అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో థియేటర్‌లు మూసివేసి ఉన్న కార‌ణంగా విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తుల‌ను ప్రభుత్వానికి అందజేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంద‌న్నారు. 5వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతించడం జరిగింద‌న్నారు.

Read Also.. 30 సంవత్సరాల తర్వాత ఈ 5 మార్పులు జీవితానికి గొప్ప మలుపు..! ఏంటో తెలుసుకోండి..

CM Jagan Bail: ఏపీ సీఎం జగన్‌‌కు ఆ రోజున బెయిల్ రద్దవుతుంది.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు