Samantha: అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేసిన సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌..

Samantha: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకెళుతోంది. పుష్ప ది రైజ్‌ పేరుతో విడుదలైన తొలి పార్ట్‌ మంచి..

Samantha: అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేసిన సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 20, 2021 | 9:06 AM

Samantha: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకెళుతోంది. పుష్ప ది రైజ్‌ పేరుతో విడుదలైన తొలి పార్ట్‌ మంచి విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్‌ నటన అద్భుతం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ఏవైనా మైనస్‌ పాయింట్స్‌ ఉన్నా.. అవి బన్నీ నటనతో కొట్టుకుపోతాయని చెబుతున్నారు. కేవలం అభిమానులే కాకుండా సెలబ్రిటీలు సైతం బన్నీ నట విశ్వరూపంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి నటి సమంత కూడా వచ్చి చేరారు. సమంత ఈ సినిమాలో ‘ఊ అంటావా మామా’ అనే స్పెషల్‌ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాను చూసిన సమంత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. పుష్పలో బన్నీ నటనపై తనదైన శైలిలో స్పందించిన సమంత.. ‘ఈ పోస్ట్‌ అల్లు అర్జున్‌ను ప్రశంసించడం కోసం చేసింది. పుష్పలో అల్లు అర్జున్ ప్రతి సెకను ప్రేక్షకులను కట్టిపడేసేలా నటించారు. ఒక యాక్టర్‌ అసాధారణమైన ప్రదర్శనతో గొప్ప నటన కనబరిస్తే.. ఆ నటన నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతాను. బన్నీ నటన కచ్చితంగా అద్భుతమైంది.. నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ సమంత క్యాప్షన్‌ జోడించారు. సమంత చేసిన ఈ పోస్ట్‌ను కేవలం గంటల వ్యవధిలోనే ఏడు లక్షలకుపైగా నెటిజన్లు లైక్‌ చేయడం విశేషం.

Also Read: Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

హ్యాపీగా నిద్రపోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి

Migraine: మైగ్రేన్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారా? మందులు పనిచేయడం లేదా? ఇలా చేయండి చాలు అంటున్నారు నిపుణులు!

USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం