Bigg Boss 5 Telugu Winner Sunny: బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ.. ఖమ్మం కుర్రోడి గురించి ఆసక్తికర విషయాలు..
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా భాషతో
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది బిగ్‌బాస్. ఇక తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుంది. నిన్నటితో బిగ్‌బాస్ సీజన్ 5 షో ముగిసింది. బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ ట్రోఫీ అందుకున్నారు. ముందు నుంచి నెగిటివిటిని మోస్తూ వచ్చిన సన్నీ.. తన ఆటతీరు… ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా… బిగ్‌బాస్ సీజన్ 5 కప్పు అందుకున్నాడు. మచ్చా.. కప్పు మనదే బిగిలూ.. డార్లింగ్ అనే పదాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడు సన్నీ.
1989లో ఖమ్మంలో పుట్టిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. ఇక సన్నీ స్కూలింగ్ మొత్తం ఖమ్మంలోనే పూర్తిచేశారు.ఆ తర్వాత ఖమ్మం స్టడీ సర్కిల్లో సీఈసీ గ్రూపుతో ఇంటర్ ఫస్టియర్ చదివారు. ఆ తర్వాత తన తల్లి వృత్తి రీత్యా కరీంనగర్ బదిలీ కావడంతో అక్కడ సెకండ్ ఇయర్ పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ చేశారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నారు సన్నీ. అతను వేసిన అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేశారు. తన కెరీర్లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు సన్నీ.
రిపోర్టర్‌గా పనిచేస్తూనే నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించాడు సన్నీ. ఆ తర్వాత కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరపై అడుగుపెట్టారు. ఇందులో జయసూర్య అలియాస్ జై పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు సన్నీ. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు సన్నీ. అలాగే మరోవైపు వెండితెరపై హీరోగా పరిచయం కానున్నారు సన్నీ. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సకలగుణాభి రామా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తనకు ఎంతో ఇష్టమైన బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆట తీరుతో చివరకు బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు.
Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..