Actress : ఎదురుగా వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టాడు.. కోరిక తీర్చమని టార్చర్ చేశాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
సినీరంగుల ప్రపంచంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద భూతంలా కొనసాగుతుంది. చాలా సంవత్సరాలుగా హీరోయిన్లు, నటీమణులు ఈ సమస్యపై పోరాడుతూనే ఉన్నారు. సినీ ప్రయాణంలో తమకు ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులను ధైర్యంగా బయటపెట్టారు. కానీ హీరోయిన్స్ మాత్రమే కాదు.. సాధారణ అమ్మాయిలు సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటారు.

ప్రపంచంలోని ప్రతి అమ్మాయి, మహిళలు, చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతి సందర్భంలో ఎక్కడో ఒకచోట ప్రతి మహిళ వేధింపులకు గురవుతుంది. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. సంవత్సరాలుగా ఈ అంశంపై హీరోయిన్లు పోరాడుతూనే ఉన్నారు. కొందరు మహిళలు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టకుండా సైలెంట్ అయిపోతారు. తాజాగా ఓ మలయాళీ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఎదురైన ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ పార్వతి తిరువోతు. చిన్నపుడు తనకు ఎదురైన పరిస్థితులు.. వాటి తాలుకూ నొప్పిని ఇంకా భరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్లానని.. ట్రైన్ కోసం వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి తన ఛాతీపై బలంగా కొట్టి పారిపోయాడని తెలిపింది. అతడు పొరపాటున కొట్టలేదని.. కావాలనే అక్కడ టచ్ చేసినట్లు తర్వాత అర్థమైందని తెలిపింది. ఆ సంఘటన తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని తెలిపింది. బయటకు వెళ్తే షాపులు చూడకుండా మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని తన తల్లి చెప్పిందని.. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణమని అన్నారు. ఇదొక్కటే కాదని.. ఇలాంటి సంఘటనలు తనకు చాలా ఎదురయ్యాయని తెలిపింది. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్ ను చూపిస్తూ అసభ్యకరమైన మాట్లాడిన సంఘటనలు ఉన్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
స్కూల్లో ఉన్నప్పుడు తాను ఒకరిని ప్రేమించానని.. అతడు తనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడని.. ప్రేమిస్తే అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా ? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 20 ఏళ్ల వయసులో స్నేహితులతో కలిసి మాల్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి లిఫ్టులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. వెంటనే అతడిని చెంపపై కొట్టానని.. సెక్యూరిటీ వచ్చి అతడిని ఆపడంతో పోలీసులకు ఫోన్ చేసి రప్పించానని అన్నారు. నన్ను నేను రక్షించుకోవడం అంత పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చింది. నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు నటించింది. ఆమె ఎక్కువగా తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.
View this post on Instagram
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..




