KhushbuSundar: ఆదివారం అమ్మ సేవలో తరించిపోయిన సీనియర్‌ నటీమణి.. మాతృమూర్తి కాలిగోర్లను కత్తిరిస్తూ..

సినిమా షూటింగ్స్‌, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటే ఖుష్బూ ఆదివారం తన సమయాన్ని తల్లి నజ్మాఖాన్‌ కోసం కేటాయించింది. ఆమెకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టింది. రోజంతా తనతో సంతోషంగా గడిపింది.

KhushbuSundar: ఆదివారం అమ్మ సేవలో తరించిపోయిన సీనియర్‌ నటీమణి.. మాతృమూర్తి కాలిగోర్లను కత్తిరిస్తూ..
Actress Khushbu Sundar
Follow us
Basha Shek

|

Updated on: Oct 31, 2022 | 8:31 AM

ఖుష్బూ సుందర్‌.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించిన ఘనత ఆమె సొంతం. 80,90 దశకాల్లో తిరుగులేని హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇలా సినిమా షూటింగ్స్‌, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటే ఖుష్బూ ఆదివారం తన సమయాన్ని తల్లి నజ్మాఖాన్‌ కోసం కేటాయించింది. ఆమెకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టింది. రోజంతా తనతో సంతోషంగా గడిపింది. ఇలా అమ్మ సేవలో తరించిపోయిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘మనసుకు కాస్త బాధగా అనిపించినప్పుడు.. కలతగా ఉన్నప్పుడు ఉపశమనం కల్పించే ప్రపంచంలోని అత్యుత్తమ ఔషధం అమ్మ. తల్లి పాదాల్లో స్వర్గం ఉంది. ఇది చాలా వాస్తవం. ఆదివారం నేను మా అమ్మ కాలిగోర్లు కత్లిరించాను. అదేవిధంగా అమ్మకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాను. అమ్మ సంతోషంగా తిన్నది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది. ఈ ఫొటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటీవల ఖుష్బూతో పాటు గౌతమి, నమిత, గాయత్రీ రఘురామ్‌లపై డీఎంకే నేత సాధిక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరందరూ ఐటమ్స్‌ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీనికి గానూ ఖుష్బూకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు డీఎంకే సీనియర్‌ లీడర్‌ కణిమొళి. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో చివరిసారిగా శర్వానంద్‌ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటించింది ఖుష్బూ. ప్రస్తుతం దళపతి విజయ్‌ హీరోగా నటిస్తోన్న వారిసు (తెలుగులో వారసుడు) సినిమాలో నటిస్తోంది. రష్మిక మంధాన కథానాయికగా కనిపించనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..