AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ?.. మహేష్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ క్రేజీ బ్యూటీ..

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం వచ్చే నెలలో ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుందట. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సూపర్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్‏ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్.

Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ?.. మహేష్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ క్రేజీ బ్యూటీ..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2022 | 7:33 AM

Share

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ వెకేషన్‏లో తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. ఈ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం వచ్చే నెలలో ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుందట. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సూపర్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్‏ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇందులో భాగంగానే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉండనుందని.. అందులో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‏మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు తెలుగుతోపాటు.. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాను హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మూవీ తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కనుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని.. యాక్షన్ అడ్వెంచర్‏గా ఈ సినిమా ఉండనుందని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా