Samantha: సమంత అనారోగ్యంపై స్పందించిన నాగబాబు.. ఆ వార్త వినగానే హృదయం ద్రవించిందంటూ ట్వీట్..

మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల సామ్ అనారోగ్యంపై స్పందించారు. ఇప్పటివరకు తనకు తెలిసిన దృఢమైన వ్యక్తులలో సమంత ఒకరని అన్నారు.

Samantha: సమంత అనారోగ్యంపై స్పందించిన నాగబాబు.. ఆ వార్త వినగానే హృదయం ద్రవించిందంటూ ట్వీట్..
Samantha, Nagababu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2022 | 7:20 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజులుగా మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సామ్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అరుదైన చర్మ సమస్య ఉందని.. అంతేకాకుండా ఇటీవల ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ టాక్ నడిచింది. దీంతో తన అనారోగ్య సమస్య గురించి ఇన్ స్టా వేదికగా తెలియజేస్తూ పుకార్లకు చెక్ పెట్టింది సామ్. ప్రస్తుతం తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ ఓవైపు చేతికి సెలైన్.. మరోవైపు డబ్బింగ్ చెబుతున్న ఫోటోను షేర్ చేసింది. సామ్ అనారోగ్యం గురించి చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంతకు ఉన్న వ్యాధి గురించి తెలిసి అటు అభిమానులు, సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆమె త్వరగా కోలుకొవాలంటూ ప్రార్థిస్తున్నారు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, శ్రియా, నాని, అక్కినేని అఖిల్, రాశిఖన్నా సమంత అనారోగ్యంపై స్పందించారు. జీవితాల్లోకి వచ్చే ఎన్నో సవాళ్లు మనలోని శక్తి సామర్థ్యాలు తెలియజేస్తాయని.. నీకు ధైర్యం, నమ్మకం ఉండాలని.. ఆ శక్తి కలగాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల సామ్ అనారోగ్యంపై స్పందించారు. ఇప్పటివరకు తనకు తెలిసిన దృఢమైన వ్యక్తులలో సమంత ఒకరని అన్నారు. ” సమంతతో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు. కానీ ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుందన్న వార్త విని నా హృదయం ద్రవించింది. నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె త్వరగా కోలుకోవాలని.. మునిపటి కంటే దృఢంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆమెను నేనెప్పుడు స్వతంత్ర మహిళగా… చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన ఆశావాద వ్యక్తిగా చూశాను. మయోసైటిస్ నుంచి ఆమె పూర్తిగా కోలుకోవాలని మరొక్కసారి నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

సామ్ మరిన్ని గొప్ప పాత్రల్లో నటించడం ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారని అన్నారు. ఆమెకు అభిమానుల ప్రేమ, అభిమానం ఈ సమస్య నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయని అన్నారు. ప్రస్తుతం సామ్ ఖుషి చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఆమె నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!