Kantara: కాంతార చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తారా ?.. రిషబ్ శెట్టి ఆన్సర్ మాములుగా లేదు..
కాంతార చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే ఏ బాలీవుడ్ హీరో మీ పాత్రకు సెట్ అవుతాడని భావిస్తున్నారు ? అని అడగ్గా.. రిషబ్ స్పందిస్తూ.. తాను ఈ సినిమాలో హిందీలో
బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన చిత్రాల్లో కాంతార ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో హోంబలే ఫిల్మ్ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక క్లైమాక్స్ అదిరిపోయిందని.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోవడం కష్టమంటూ నెట్టింట రివ్యూలు ఇచ్చేస్తున్నారు . అయితే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న హీరో రిషబ్ శెట్టి…ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే కాంతార హిందీ రీమేక్ పై స్పందించారు.
కాంతార చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే ఏ బాలీవుడ్ హీరో మీ పాత్రకు సెట్ అవుతాడని భావిస్తున్నారు ? అని అడగ్గా.. రిషబ్ స్పందిస్తూ.. తాను ఈ సినిమాలో హిందీలో రీమేక్ చేయకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. ” ఇలాంటి పాత్రలు చేయాలంటే మూలాలు, సంస్కృతిపై నమ్మకం ఉండాలి. హిందీ చిత్రపరిశ్రమలో నేను అభిమానించే చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ ఈ సినిమాను రీమేక్ చేసే ఆసక్తి మాత్రం లేదు. ” అని అన్నారు. అలాగే.. ఈ సినిమా షూటింగ్ ముందు 20-30 రోజుల ముందు నుంచే తాను నాన్ వెజ్ తినడం మానేసినట్లు చెప్పుకొచ్చారు.
నటన భాగం చాలా కష్టమైనది. కొన్నిసార్లు యాక్షన్ సన్నివేశాలు ఎక్స్ ప్రెస్ చేయడం నా వల్ల కాదు. ముఖ్యంగా దైవ్ కోలా సీక్వెన్స్ సమయంలో నేను దాదాపు 50-60 కిలోల బరువు మోయాల్సి ఉంటుంది. ఆ సీక్వెన్స్ చేయడానికి 20-30 రోజుల ముందు నాన్ వెజ్ తినడం మానేసాను. దైవ్ కోల అలంకారం వేసుకున్న తర్వాత కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకునేవాడినికి. సీక్వెన్స్ చేయడానికి ముందు.. ఆ తర్వాత నాకు కేవలం ప్రసాదం మాత్రమే ఇచ్చేవారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం కాంతార చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతన్న సంగతి తెలిసిందే.