Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..
టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సురేష్. 1980, 90ల కాలంలో కథానాయకుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా రాణించారు. హీరోగా చేస్తూనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అద్భుతంగా పండించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటుడు సురేష్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం, తోటి హీరోలతో ఆరోగ్యకరమైన పోటీ, షూటింగ్ విశేషాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సురేష్ తన సమకాలీన నటులైన సుమన్, భానుచందర్, వినోద్ కుమార్ వంటి వారితో ఉన్న సంబంధాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తమ మధ్య పోటీ ఉన్నప్పటికీ, అది చాలా ఆరోగ్యకరంగా ఉండేదని చెప్పారు. తామెప్పుడూ స్క్రీన్ టైమ్ లేదా సీన్ల సంఖ్య గురించి ఆలోచించలేదని, కేవలం పాత్ర ప్రాధాన్యతను మాత్రమే చూసేవాళ్లమని స్పష్టం చేశారు. ‘పరువు ప్రతిష్ట’ సినిమాలో సుమన్‌తో కలిసి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వెనుక ఉన్న కథను వివరిస్తూ, సినిమాలో ఎంతసేపు కనిపిస్తామనే దానికంటే ఎంత ప్రభావం చూపామనేదే ముఖ్యమని నమ్మేవాడినని తెలిపారు.
చిరంజీవి అంటే తనకు మొదటి నుంచి ఎంతో ఇష్టమని, ఒక కమర్షియల్ హీరో ఎలా ఉండాలో ఆయన చూపించారని సురేష్ కొనియాడారు. ‘ఇద్దరు మిత్రులు’ సినిమా షూటింగ్ సమయంలో విజయవాహిని స్టూడియోలో తన డాన్స్ చూసి చిరంజీవి స్వయంగా వచ్చి అభినందించిన మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటికే చిరంజీవి పెద్ద హీరో అయినప్పటికీ తన డ్యాన్స్ గురించి స్వయంగా వచ్చి మాట్లాడటం చూసి షాకయ్యానని అన్నారు. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలో సురేష్ వాడిన ‘టచక్’ అనే పదం చిరంజీవికి ఎంతో నచ్చిందని, ప్రతి సీన్‌లోనూ ఆ పదాన్ని ఉపయోగించమని స్వయంగా చిరంజీవి ప్రోత్సహించారని చెప్పారు. తోటి నటుల ప్రతిభను స్వాగతించే గొప్ప మనసు చిరంజీవిదని ఆయన ప్రశంసించారు. చిరంజీవి అంటే తనకు మొదటి నుంచి అమితమైన ఇష్టమని తెలిపారు.
తమిళ చిత్రం ‘తునై’లో లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌ను నెట్టేయాల్సిన సీన్ వచ్చినప్పుడు సురేష్ వెనుకాడగా, శివాజీ గణేషన్ చెప్పిన ఒక సామెత చెప్పారని సురేషన్ అన్నారు. ఆ సమయంలో శివాజీ గణేషన్ స్పందిస్తూ.. “కుక్క వేషం వేసినప్పుడు మొరగక తప్పదు, పాత్రకు న్యాయం చేయాలి (మనం కుక్క వేషం వేసినప్పుడు మొరగక తప్పదు నాయనా.. పాత్రకు న్యాయం చేయాలంటే మొహమాటాలు ఉండకూడదు)” అని ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు. అయితే విలన్ పాత్రల వల్ల ప్రజల్లో వచ్చే నెగటివిటీ గురించి చెబుతూ.. ‘సూర్యుడు’ సినిమా విడుదలైన తర్వాత రాజమండ్రి వెళ్లినప్పుడు, అక్కడి జనాలు సినిమాలోని తన పాత్రను చూసి నిజంగానే తిట్టారని, అది ఒక నటుడిగా తనకు లభించిన గుర్తింపుగా భావిస్తానని సురేష్ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
చిరంజీవి ఫోటో..

Suresh, Chiranjeevi
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
