Genelia: జెనిలీయా మళ్లీ తల్లి కాబోతుందా.? భర్త రితేష్ సమాధానం ఇదే..

ఇటీవల నటి జెనిలీయా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ముంబైలో ఒక నైట్‌ పార్టీకి అటెండ్ అయ్యింది. అదే సమయంలో జెనిలీయా భర్తతో కలిసి మీడియాకు పోజులిచ్చారు. ఈ ఫొటోలే నెట్టింట చర్చకు దారి తీశాయి. బ్లూ కలర్ ఫ్రాక్‌లో ఉన్న జెనీలియాకు కాస్త బేబీ బంప్‌ ఉన్నట్లు కనింపించింది. అంతేకాకుండా జెనిలీయా కూడా పదే పదే పొట్టపై చేతి పెట్టుకోవడంతో ఆమె తల్లి కాబోతోంది అంటూ రూమర్స్‌ వ్యాపించాయి. ఇంకేముంది జెనిలీయా ప్రెగ్నెన్సీ అంటూ. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది..

Genelia: జెనిలీయా మళ్లీ తల్లి కాబోతుందా.? భర్త రితేష్ సమాధానం ఇదే..
Genelia
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2023 | 3:41 PM

సెలబ్రిటీలు ఏది మాట్లాడినా, ఏది మాట్లాడకపోయినా సంచలనమే. నిత్యం మీడియాతోపాటు అభిమానుల కళ్లపై వారిపైనే ఉంటాయి. అందుకే సెలబ్రిటీలు ఎప్పుడు ఏది చేసినా జాగ్రత్తగా ఉంటారు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి బాగా పెరిగిన తర్వాత సెలబ్రిటీలు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు.? ఏం చేస్తున్నారు.? ఏం తింటున్నారు.? ఇలా నిత్యం చూస్తూనే ఉంటారు. ఏ చిన్న అంశం కాస్త డిఫ్రెంట్‌గా కనిపించినా సరే వెంటనే వైరల్‌ అయిపోతుంది. క్షణాల్లో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా నటి జెనిలీయాకు సంబంధించి అలాంటి ఓ వార్తే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల నటి జెనిలీయా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ముంబైలో ఒక నైట్‌ పార్టీకి అటెండ్ అయ్యింది. అదే సమయంలో జెనిలీయా భర్తతో కలిసి మీడియాకు పోజులిచ్చారు. ఈ ఫొటోలే నెట్టింట చర్చకు దారి తీశాయి. బ్లూ కలర్ ఫ్రాక్‌లో ఉన్న జెనీలియాకు కాస్త బేబీ బంప్‌ ఉన్నట్లు కనింపించింది. అంతేకాకుండా జెనిలీయా కూడా పదే పదే పొట్టపై చేతి పెట్టుకోవడంతో ఆమె తల్లి కాబోతోంది అంటూ రూమర్స్‌ వ్యాపించాయి. ఇంకేముంది జెనిలీయా ప్రెగ్నెన్సీ అంటూ. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది అంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. కొంత మంది అభిమానులు సైతం ఈ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ జెనిలియా మరోసారి తల్లి కాబోతోంది అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టులను ఆధారంగా చేసుకొని మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. బాలీవుడ్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్స్‌ జెనిలియా తల్లి కాబోతోంది అంటూ వార్త కథనాలు పబ్లిష్‌ చేశారు. ఈ వార్త కాస్త వైరల్‌ కావడం, జెనిలీయా భర్త రితేశ్‌ కంటపడింది. దీంతో ఈ వార్తపై అధికారికంగా స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ రూమర్స్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ స్పష్టతనిచ్చాడు. ‘నాక్కూడా ఇంకా ఇద్దరు, ముగ్గురు పిల్లలు కావాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ వార్తలో నిజం లేదు’ అంటూ ఫన్నీగా రుమర్స్‌కు చెక్‌ పెట్టాడు.

Riteish Deshmukh

ఇదిలా ఉంటే జెనిలీయా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రయల్‌ పీరియడ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇక రితేష్‌ కెరీర్ విషయానికొస్తే హౌస్‌ఫుల్‌5లో నటించనున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, రితేష్‌ కలిసి నటించనున్నారు. ఇక జెనిలీయా, రితేష్‌ కలిసి చివరి సారిగా మరాఠీలో ‘వేద్‌’ సినిమాలో నటించారు. ఈ సినిమా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘మజిలీ’ చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!