Peddha Kapu Trailer: శ్రీకాంత్‌ అడ్డాల మరీ ఇంత వయలెంట్‌గా మారాడేంటీ.. అరాచకంగా పెదకాపు ట్రైలర్

ప్రముఖ నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు శ్రీకాంత్‌. సినిమా టైటిల్‌ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన శ్రీకాంత్ అడ్డాల.. టీజర్‌తో ఈ అంచనాలను ఆకాశానికి తాకేలా చేశారు. సామాన్యుడు సంతకం అనే ట్యాగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఒకెత్తు అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా హైప్‌ మరింత పెరిగింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌ దుమ్మురేపుతోంది...

Peddha Kapu Trailer: శ్రీకాంత్‌ అడ్డాల మరీ ఇంత వయలెంట్‌గా మారాడేంటీ.. అరాచకంగా పెదకాపు ట్రైలర్
Pedakapu 1 Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2023 | 3:08 PM

కొత్త బంగారు లోకం, సీతమ్మవాకింట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం ఇలాంటి ఫీల్‌ గుడ్ మూవీస్‌కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్‌ అడ్డాల.. తనలోని మరో యాంగిల్‌ను బయట పెడుతూ నారప్ప సినిమాను తెరకెక్కించాడు. పేరుకు రీమేక్‌ చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకులను అలరించేలా శ్రీకాంత్ ఈ సినిమా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పెదకాపు1 పేరుతో అరాచకం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇంత వరకు తాను తీసిన చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కుల రాజకీయాల నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.

ప్రముఖ నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు శ్రీకాంత్‌. సినిమా టైటిల్‌ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన శ్రీకాంత్ అడ్డాల.. టీజర్‌తో ఈ అంచనాలను ఆకాశానికి తాకేలా చేశారు. సామాన్యుడు సంతకం అనే ట్యాగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఒకెత్తు అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా హైప్‌ మరింత పెరిగింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. పూర్తిగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్‌ గమనిస్తే పాత్రల డిజైన్‌లో శ్రీకాంత్ ఎంత జాగ్రత్త తీసుకున్నాడో స్పష్టమవుతోంది. సినిమాలో ప్రతీ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక ట్రైలర్‌ను గమనిస్తే.. అగ్ర కులాల రాజకీయాల కారణంగా దళిత వర్గాల ప్రజలకు అణచివేతకు గురవుతోన్న గ్రామంలోని ఓ యువకుడు వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడతాడు. బలమైన వ్యవస్థను ఆ కుర్రాడు ఎలా ఎదురించాడు, తమ జాతిని తక్కువ చేసి చూసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే సినిమా కథగా స్పష్టమవుతోంది. మనోభావాలకు సంబంధించిన ఇలాంటి ఓ సెన్సిటివ్‌ ఇష్యూను కథాంశంగా ఎంచుకోవడంలో శ్రీకాంత్ అడ్డాల ధైర్యం చేశాడని చెప్పాలి. ఇక ట్రైలర్‌లో ప్రతీ సన్నివేశం పూర్తి స్థాయిలో యాక్షన్‌ డ్రామాగా ఉంది. మిక్కీజే మేయర్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒక ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా శ్రీకాంత్ అడ్డాల ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి కథాంశాన్ని ఎంచుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలో ముకుందా చిత్రంలో ఇలాంటి కథాంశాన్నే ఎంచుకున్న శ్రీకాంత్‌ ఎలాంటి కాంట్రవర్సీలు రాకుండా సినిమాను తెరకెక్కించాడు. అయితే పెదకాపు ట్రైలర్‌ గమనిస్తే మాత్రం ఈ సినిమా చుట్టూ వివాదాలు తప్పేలా కనిపించడం లేదు. ట్రైలర్‌తో ఆకాశాన్ని తాకిన అంచనాలను శ్రీకాంత్‌ అడ్డాల నిలబెట్టుకుంటాడా.? లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 28వ వరకు వేచి చూడాల్సిందే.

పెదకాపు1 సినిమా ట్రైలర్‌..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..