Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss. Shetty Mr. Polishetty: దూసుకుపోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్

నవీన్.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు ఫై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో స్టార్ హీరోయిన్ అనుష్క నటించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి షో నుంచి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. అలాగే కలెక్షన్స్ విషయంలోనూ సత్తా చాటుతుంది ఈ సినిమా.. సినిమా రిలీజ్ కు ముందు నవీన్ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు.

Miss. Shetty Mr. Polishetty: దూసుకుపోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్
Miss Shetty Mr Polishetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2023 | 2:09 PM

నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడింది. శ్రీనివాస్ ఆత్రేయ , జాతిరత్నాలు లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న నవీన్.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు ఫై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో స్టార్ హీరోయిన్ అనుష్క నటించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి షో నుంచి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. అలాగే కలెక్షన్స్ విషయంలోనూ సత్తా చాటుతుంది ఈ సినిమా.. సినిమా రిలీజ్ కు ముందు నవీన్ ప్రమోషన్స్ మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సేమ్ డే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. దాంతో జవాన్ సినిమా ఎఫెక్ట్ ఈ సినిమా పై కాస్త ప్రభావం చుపిందనే చెప్పాలి. అయినా కూడా జవాన్ క్రేజ్ ను తట్టుకుంటూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ సాధిస్తోంది. హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ లో జాతిరత్నాలు తర్వాత యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ సాధించిన రెండో సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కావడం విశేషం.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ని ఎన్ఆర్ఐ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. రిలీజ్ డే నుంచి హీరో నవీన్ పోలిశెట్టి యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న ప్రమోషనల్ టూర్ కూడా అక్కడి వారిని సినిమా వైపు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి టూర్ బే ఏరియా కాలిఫోర్నియాకు చేరుకుంది. ఇక్కడే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వన్ మిలియన్ మార్క్ సెలబ్రేషన్ చేసుకుందామంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.