AR రెహ్మాన్ చెన్నై మ్యూజిక్ కన్సర్ట్‌లో తొక్కిసలాట.. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం
"నిర్వాహకులు (ACTC ఈవెంట్ వారు) వేదికలో దాదాపు 46,000 కుర్చీలు వేశారు. కొన్ని సెక్షన్‌లలో అందరూ ఒకవైపు కూర్చున్నారు. మరొక వైపుకు వెళ్లలేదు. ఇది చూసి, విధుల్లో ఉన్న పోలీసులు వేదిక నిండిపోయిందని భావించారు. గేట్లు మూసివేశారు. ఈ సమయానికి, లోపల ప్రదర్శన ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో బయట గందరగోళ పరిస్థితులు తలెత్తాయని ”అని రెహ్మాన్ తెలిపారు. జరిగిన ఘటన తనను బాధించిందని.. ఎవరిని వేలెత్తి చూపకుండా.. తాను బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు.
చెన్నై శివారు ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో నిర్వహించిన ఆస్కార్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో AR రెహ్మన్ కాన్సర్ట్‌లో గందరగోళం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదని అభిమానులు ఆరోపించారు. ఈ సంగీత విభావరి చూసేందుకు 50 వేల మంది తరలివచ్చారు. టికెట్లు ఉన్నా చాలా మందిని లోపలికి అనుమతించలేదని అభిమానులు ఆరోపించారు. షోకు వచ్చిన చాలా మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు. పిల్లలు ఏడ్పులు, స్పృహ కోల్పోయిన మహిళలతో ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రాంతం గందరగోళంగా కనిపించింది.
మరాకుమ నెంజం పేరుతో నిర్వహించిన ఈ మ్యూజిక్ కన్సర్ట్ వాస్తవానికి ఆగస్టు 12న జరగాల్సి ఉంది. అప్పుడు వాతావరణం సరిగ్గా లేకపోవడంతో దాన్ని సెప్టెంబర్ 10కి వాయిదా వేశారు. నిన్న ఈ ప్రోగ్రామ్ చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. డబ్బులిచ్చి టికెట్లు కొన్నా ప్రోగ్రామ్ చూడలేకపోయామని ఆరోపిస్తూ చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అంతా ఆ ప్రోగ్రామ్ గురించి నెగిటివ్ కామెంట్స్‌తో నిండిపోయింది.
WORST WORST WORST CONCERT EVER!! Very poorly organised concert by the organiser. No proper coordination from road to seating everything. Horrible planning. THEY HAVE TAKEN FANS FOR GRANTED. I feel like SCAM of money!! @actcevents @arrahman #marakumanenjam #arrconcert
— Kanimozhi Manoharan (@Kaniiii___) September 10, 2023
మరో వైపు తమ షో దిగ్విజయంగా జరిగిందని నిర్వాహకులు ACTC ఈవెంట్స్ వారు ట్వీట్స్ చేశారు. ఊహించని సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారని పేర్కొన్నారు. భారీ రద్దీ కారణంగా షోకు హాజరుకాలేకపోయిన వారికి క్షమాపణలు చెప్పారు. దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు. ఇదే ట్వీట్‌ను AR రెహ్మాన్ రీట్వీట్ చేశారు. టికెట్ ఉండి షో చూడలేకపోయిన వారికి టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని తెలిపారు. ఈవెంట్‌లో జరిగిన దానితో తాను చాలా డిస్టర్బ్ అయ్యానని తెలిపారు.
ఆస్కార్-విజేత AR రెహమాన్‌కు భారతదేశంలో, విదేశాలలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పాటలు ఎప్పుడు విడులవుతాయా అని వారంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చైన్నైలో లైవ్ ప్రదర్శనలు ఇస్తున్నందున, జనాల్లో విపరీతమైన హైప్ ఉంటుంది. వాస్తవానికి ఆగస్టు 12న ఈ కాన్సర్ట్ తొలుత షెడ్యూల్ చేయబడింది. అయితే భారీ వర్షాలు నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం సాయంత్రానికి రీ షెడ్యూల్ చేశారు. కాన్సర్ట్ హాజరయ్యేందుకు టిక్కెట్‌కు 5000 రూపాయలు ఖర్చు చేసిన AR రెహమాన్ డైహార్డ్ అభిమానులు, వేదిక వద్ద తమకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో.. నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
the number of men who used the crowd as an excuse to violate women today..we were struggling to breathe and were also violated. fuck all those men and fuck @actcevents the fan in me died today @arrahman thank you for that🙏
— Pavitra (@pavitrash_) September 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..